పులి చర్మంతో కుక్క.. షాక్ అయిన జంతు ప్రియులు!

పులి, కుక్క రూపంలో కానీ, ప్రవర్తనలో కానీ ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి.కుక్క విశ్వాసానికి ప్రతీకగా నిలిచే జంతువు కాగా పులి మాత్రం క్రూర జంతువు.

పులి చర్మంతో కుక్కను కానీ, కుక్క చర్మంతో పులిని కానీ సరదాగా కూడా ఊహించలేం.

అయితే తాజాగా పులి చర్మంతో ఉన్న కుక్క ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఎవరైనా దూరం నుంచి చూస్తే నిజంగానే పులి వచ్చిందని భయాందోళనకు గురైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

పులిపై ఏ విధంగా చారలు ఉంటాయో ఈ కుక్కపై కూడా అదే విధంగా చారలు ఉండటంతో సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ అవుతోంది.

అయితే ఇది పులా.? కుక్కా.

? అనే అనుమానం వచ్చిందంటే ఒక ఆకతాయి చేసిన అల్లరి పని గురించి తెలుసుకోవాల్సిందే.

మలేషియాకు చెందిన ఒక ఆకతాయి తన అపారమైన ప్రతిభతో కుక్కకు పులి రూపాన్ని తీసుకొచ్చాడు.

తన యొక్క టాలెంట్ ను అక్కడ ఉండే వీధికుక్కపై చూపాడు.వీధికుక్కకు రంగులు వేసి కుక్కను కాస్తా పులిని చేశాడు.

దీంతో అక్కడి స్థానికులు మొదట కుక్కను చూసి పులిగా భావించి భయపడినా తరువాత అసలు నిజం తెలిసి ఊపిరి పీల్చుకున్నారు.

మలేషియా యానిమల్ అసోషియేషన్ పులి చారలతో ఉన్న కుక్క ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఫోటో తెగ వైరల్ అవుతోంది.

ఆ సంస్థ కుక్కపై రంగులు వేసిన వ్యక్తి, కుక్క వివరాలు చెబిత్తే ఆ వ్యక్తికి బహుమతి ఇస్తామని ప్రకటించింది.

అయితే పులి చారలతో ఉన్న కుక్కను చూసి జంతు ప్రేమికులు అవాక్కవుతున్నారు.

కొరటాల-ప్రభాస్ కాంబోలో మరో మూవీ.. ఈ టైమ్‌లో ఫ్యాన్స్‌కి ఓకేనా..?