బైక్ ను ఢీకొట్టిన ఎద్దు.. పక్కనుండి కారు దూసుకెళ్లడంతో!
TeluguStop.com
మన దగ్గర అలాంటి దృశ్యాలు కనిపించడం సర్వ సాధారణం.ఎలాంటివి అనుకుంటున్నారా.
రోడ్లపై పశువులు తిరగడం.పెద్ద పెద్ద మెట్రో నగరాల నుండి చిన్న చిన్న పల్లె టూర్ల వరకు ప్రతి చోట పశువులు ఇష్టా రీతిగా తిరుగుతుంటాయి.
నడి రోడ్డుపై నుండే నడుస్తుంటాయి.రోడ్లపైనే నిద్రిస్తాయి.
కనిపించిన వారిపై దాడి కూడా చేస్తుంటాయి ఒక్కోసారి.పంజాబ్ బర్నాలా నగరంలో అన్ని ప్రాంతాల్లోలాగే అక్కడ కూడా రోడ్లపై పశువులు విచ్చల విడిగా తిరుగుతుంటాయి.
అలా తిరుగుతున్న రెండు ఎద్దుల మధ్య జరిగిన పొట్లాట.మరో వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చింది.
అసలు ఆ ఎద్దుకు పోట్లాడాయి, దీని వల్ల వ్యక్తి ఎలా చనిపోయానే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
బర్నాలా నగరంలోని హందియాయ రోడ్డుపై రెండు ఎద్దులు ఘర్షణ పడ్డాయి.ఒకదానితో ఒకటి కొట్లాడుకున్నాయి.
అలా పొట్లాడుతూనే ఉన్నట్టుండి రోడ్డుపైకి దూసుకువచ్చాయి.అదే సమయంలో అటు నుండి వెళ్తున్న బైక్ ను బలంగా ఢీకొట్టింది ఓ ఎద్దు.
దాంతో ఆ వాహనాదారుడు అంత దూరంలో పడిపోయాడు.అదే సమయంలో అటు కారు వేగంగా వస్తోంది.
ద్విచక్ర వాహనాదారుడిని ఆ కారు ఢీకొట్టింది.బైక్ పై నుండి వెళ్లింది.
ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు.ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
తీవ్రంగా గాయపడ్డ ద్విచక్ర వాహనదారుడిని స్థానికులు బర్నాలా ప్రభుత్వ దవాఖానాకు తరలించారు.పరిస్థితి విశమంగా ఉండటంతో పటియాలా ఆస్పత్రికి తీసుకెళ్లారు.