స్టొమక్ అల్సర్‌ను నివారించే స్ట్రాబెర్రీలు..ఎలా తీసుకోవాలంటే?

స్టొమ‌క్ అల్స‌ర్‌ స్త్రీ, ప‌రుషులు అనే తేడా లేకుండా చాలా మందిని కామ‌న్‌గా వేధించే స‌మ‌స్య ఇది.

క‌డుపులో ప‌లు చోట్ల  పుండ్లు ప‌డ‌ట‌మే అల్స‌ర్ అంటారు.క‌డుపులో అల్స‌ర్ ఏర్ప‌డ‌టం వ‌ల్ల‌ తీవ్రమైన నొప్పి మ‌రియు మంట ఉంటుంది.

కలుషితమైన ఆహారం నీరు తీసుకోవ‌డం, కెఫిన్ అధికంగా తీసుకోవ‌డం, మ‌ధ్యపానం, పొగత్రాగడం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల అల్స‌ర్ ఏర్ప‌డుతుంది.

ఇక ఈ స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం పొందేందుకు ఎన్నో మందులు వాడుతుంటారు.కానీ, కొన్ని కొన్ని ఆహారాల ద్వారా కూడా స్టొమ‌క్ అల్స‌ర్‌ను నివారించుకోవ‌చ్చు.

అలాంటి వాటిలో స్ట్రాబెర్రీస్ కూడా ఉన్నాయి.చూసేందుకు ఎర్ర ఎర్ర‌గా, తినేందుకు రుచిగా ఉండే స్ట్రాబెర్రీల్లో పోష‌కాలు కూడా మెండుగానే ఉంటాయి.

విట‌మిన్ ఎ, విట‌మిన్ సి, విట‌మిన్ ఇ, మెగ్నీషియం, క్యాల్షియం, ఐరన్, పాస్ఫరస్, ఫైబ‌ర్‌, ఫోలిక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోష‌కాలు స్ట్రాబెర్రీల్లో ఉంటాయి.

"""/" / అందుకే స్ట్రాబెర్రీలు ఆరోగ్యానికి మంచి వ‌ని నిపుణులు చెబుతుంటారు.ముఖ్యంగా స్టొమ‌క్ అల్స‌ర్‌కు చెక్ పెట్ట‌డంలో స్ట్రాబెర్రీలు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.

స్టొమ‌క్ అల్స‌ర్‌తో బాధ ప‌డే వారు స్ట్రాబెర్రీల‌తో త‌యారు చేసిన ర‌సం తీసుకోవ‌డం లేదా స్ట్రాబెర్రీల‌ను ఓట్స్‌తో క‌లిపి తీసుకోవ‌డం లేదా పెరుగుతో క‌లిపి స్ట్రా బెర్రీల‌ను తీసుకోవ‌డం చేయాలి.

డైరెక్ట‌ర్‌గా కూడా ఈ పండ్ల‌ను తీసుకోవ‌చ్చు.ఇలా ఎలా తీసుకున్నా స్టొమ‌క్ అల్స‌ర్ క్ర‌మంగా త‌గ్గి పోతుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

ఇక స్ట్రాబెర్రీ పండ్ల‌ను డైట్‌లో చేర్చు కోవ‌డం వ‌ల్ల అల్స‌ర్ త‌గ్గ‌డ‌మే కాదు.

 అజీర్తి, గ్యాస్‌, క‌డుపు ఉబ్బ‌రం వంటి స‌మ‌స్యలు దూరం అవుతాయి.జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరు మెరుగుప‌డుతుంది.

మెద‌డు చురుగ్గా మారుతుంది.ఎముక‌లు, కండ‌రాలు దృఢంగా అవుతాయి.

కంటి చూపు మెరుగు ప‌డుతుంది.కీళ్ల నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

మ‌రియు వెయిట్ లాస్ కూడా అవ్వొచ్చు.

విజయ్ సేతుపతి ఫ్యాన్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఆ హిట్ మూవీకి సీక్వెల్ రానుందా?