కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో రేపు స్ట్రాటజీ సమావేశం ఉండనుందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒకటేనని తెలిపారు.ఈ క్రమంలో కేంద్రంపై మండిపడిన ఆయన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
అంతేకాకుండా కేసీఆర్ మహారాష్ట్ర వెళ్లినప్పుడల్లా కాంగ్రెస్ పార్టీనే తిడుతున్నారని మండిపడ్డారు.కానీ బీజేపీని కేసీఆర్ ఒక్క మాట కూడా అనడం లేదు ఎందుకనని నిలదీశారు.
ఏదీ ఏమైనా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
హీరోయిన్ రష్మికను టార్చర్ చేయకండి.. నటి రమ్య షాకింగ్ కామెంట్స్ వైరల్!