వింత గ్రామం: అక్కడ అందరూ గుహలలోనే నివాసం.. ఎక్కడంటే..?!

మనం అందరం ఇళ్ళు భూమి మీద నిర్మించు కుంటూ ఉంటాము.కానీ అక్కడి ప్రజలు మాత్రం భూమి లోపల గుహల్లో నివసిస్తూ ఉంటారు.

అయితే అక్కడ నివసించే ప్రజల గురించి చాలాకాలం పాటు ఎవరికీ తెలియదు.1969 వ సంవత్సరం వరకు ప్రపంచంలోని ఎవరికీ కూడా అసలు అలాంటి గ్రామం ఒకటి ఉందనే విషయం కూడా ఎవరికీ తెలియదు.

కానీ 1969 వ సంవత్సరం తరువాత భూగర్భంలో నిర్మించిన ఇళ్ల గురించి అందరికి తెలిసాయి.

అది ఎలా అంటే 1969 వ సంవత్సరంలో వచ్చిన భారీ వరదల కారణంగా భూగర్భంలో నిర్మించిన ఇళ్లు నీటితో నిండిపోయినప్పుడు ఈ గ్రామం వెలుగులోకి వచ్చింది.

అప్పుడు హుటాహుటిన ఆ గ్రామంలోని బాధిత ప్రజలను అక్కడి నుండి కాళీ చేయించి వేరే చోటికి తరలించారు.

మళ్ళీ కొన్నాళ్ళకు ఆ గ్రామస్తులు తిరిగి అవే గుహలలోకి వెళ్లి నివాసం ఉంటున్నారు.

ఇంతకీ ఈ గ్రామం ఎక్కడ ఉంది అని అనుకుంటున్నారా.ఈ గ్రామం ట్యునీషియాకి దక్షిణ భాగంలో ఉంది.

ఈ గ్రామం పేరు మత్మత.ఈ గ్రామంలో నివసించే ప్రజలు అందరికంటే భిన్నంగా నివాసిస్తారు.

ఇక్కడ భూమి కింద లోతైన గుహలు ఉన్నాయి.అందులోనే వాళ్ళు నివసిస్తారు.

ప్రస్తుతం ఈ ప్రదేశం ఇప్పుడు ఒక పర్యాటక కేంద్రంగా మారి పోయింది.ఇలాంటి గుహలను మీరు సినిమాల్లో చూసి ఉంటారు .

స్టార్ వార్‌తో సహా కొన్ని రకాల హాలీవుడ్ చిత్రాలను ఇక్కడే చిత్రీకరించడం జరిగింది.

ఈ భూగర్భ గుహలలో అక్కడి ప్రజలు ఎందుకు నివసిస్తున్నారనే దానిపై అక్కడి గ్రామస్తులు ఇలా చెప్పుకొచ్చారు.

ఈ ఇళ్లు మాకు చాలా ముఖ్యమైనవి.ఈ ఇళ్లలో ఉంటే చలి, ఎండ నుంచి మాకు రక్షణ ఉంటుంది అని చెప్పుకొచ్చారు.

ఇక్కడ మాకు అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయని కరెంట్ తో పాటు టెలివిజన్ సౌకర్యం కూడా ఉందని చెప్పుకొచ్చారు.

"""/" / ఈ గ్రామస్థుల జీవన శైలి గురించి తెలిసి పర్యాటకులు కూడా ఎక్కువ సంఖ్యలో ఈ గ్రామానికి తరలివస్తున్నారు.

పర్యాటకుల సంఖ్య పెరుగుతుండటంతో ఇక్కడి గ్రామస్తులు తమ ఇళ్లలోని కొన్ని గదులను హోటళ్లుగా మార్చేశారు.

ఇప్పుడు అదే వారికి ఆదాయ మార్గంలా మారింది.ఇదిలా ఉండగా ఈ గ్రామానికి చెందిన 46 ఏళ్ల మోంజియా మాట్లాడుతూ తాను ఈ ఇంటిని వదిలి ఎక్కడికీ వెళ్లాలని అనుకోవడంలేదని తేల్చి చెప్పేసారు.

ఈ ప్రాంతంలో లభించే ప్రశాంతత మరెక్కడా దొరకదని అన్నారు.అలాగే గ్రామస్తులు కూడా వేరే చోటుకు వెళ్లేందుకు ఇష్టపడడం లేదు సరి కదా.

ఇదే తమకు చాలా సురక్షితమైన ప్రదేశం అని అంటున్నారు.

వైరల్ వీడియో: రోమాలు నిక్కపరిచేలా టీమిండియా టి20 ప్రపంచ కప్ ప్రోమో..