ఆ గ్రామంలో వింత శ‌బ్ధాలు.. భ‌యంతో నిద్రపోని గ్రామ‌స్తులు

కొద్ది రోజుల క్రితం వరకు అంతా ప్రశాంతంగా, ఆనందంగా ఉన్న ఆ ఊరి ప్రజలు ప్రస్తుతం భయాందోళనకు గురవుతున్నారు.

ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక రాత్రి, పగలు భయం భయంతో బతుకుతున్నారు.ఇంతకీ ఆ ఊరు ఏంటి? అక్కడి ప్రజలు ఎందుకలా ఉంటున్నారో చూద్దాం.

ఏపీ రాష్ట్రం అనంతపురం జిల్లాలో బుక్కపగ్నం మండలంలోని మదిరేబైలు అనేది ఓ చిన్న పల్లెటూరు.

ప్రస్తుతం ఈ గ్రామస్తులకు కంటి మీద కునుకు సైతం ఉండటం లేదు.ఎందుకంటే ఆ గ్రామంలో పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఆకాశం నుంచి పెద్దగా శబ్ధాలు వస్తున్నాయి.

భూమి కంపిస్తున్న ఆ శబ్ధాలతో వారు భయపడిపోతున్నారు.ఆకాశం నుంచి ఏమైనా తమ మీద పడుతుందేమోనన్న అనుమానం వారిని వెంటాడుతోంది.

శబ్ధాలు వచ్చినప్పుడల్లా భూ కంపం వస్తుందేమో అని భయపడుతున్నారు.ఈ వింత శబ్ధాలతో వారు కనీసం నిద్రకూడా పోవడం లేదు.

ఇక చిన్నపిల్లలు, ముసలివారు మరింతగా ఆందోళనకు గురవుతున్నారు.ఈ క్రమంలోనే ఇంట్లోని వస్తువులు కిందపడటం, ఓ పాత ఇట్లు కూలిపోవడంతో వారు భయం మరింత రెట్టింపు అయింది.

దీనికి తోడు ఇటీవల భారీ వర్షాలు కురవడంతో ఆ గ్రామ ప్రజల్లో ఆందోళన, భయం మరింతగా పెరిగాయి.

"""/"/ ఈ విషయాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులకు చెప్పారు.గ్రామాన్ని పరిశీలించాలని, శబ్ధాలకు గల కారణాలు తెలుసుకుని గ్రామస్తులకు సపోర్ట్ గా ఉండాలని కోరుతున్నారు.

ఈ సౌండ్ లకు ఇండ్లు సైతం దెబ్బతింటుండటంతో ఏ టైంలో ఏం జరుగుతుందోనని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.

కానీ ఆ శబ్ధాలకు గల కారణాలు మాత్రం ఇంకా తెలియలేదు.అధికారులు, నిపుణులు స్పందిస్తే గానీ అందుకు గల కారణాలు తెలియవు.

ఈ విషయం తెలియడంతో చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజల్లో సైతం కొంచెం ఆసక్తి, కొంచెం భయం నెలకొంది.

తెలంగాణలోనూ మొదలైన పోలింగ్ .. ఇక్కడి పరిస్థితి ఏంటంటే ?