కార్న్‌వాల్ బీచ్‌లో వింత ఘటన.. సముద్రంలోకి కొట్టుకుపోయిన ఐస్‌క్రీమ్ వ్యాన్..??
TeluguStop.com
ఇంగ్లాండ్( England )లో ఓ ఊహించని సంఘటన చోటు చేసుకుంది.ఒక ఐస్‌క్రీమ్ వ్యాన్ కార్న్‌వాల్‌లోని పాపులర్ హార్లన్ బే బీచ్‌లో పార్క్ చేసి ఉండగా దానిని సముద్రంలోకి తీసుకుపోయాయి.
ఈ సంఘటన జులై 7వ తేదీ సాయంత్రం 4 గంటల ప్రాంతంలో జరిగింది.
బీచ్‌లో పార్క్ చేసి ఉన్న ఐస్‌క్రీమ్ వ్యాన్‌ను అలలు తీసుకువెళ్లి, ఒడ్డు నుంచి దూరంగా నెట్టాయి.
చాలా మంది స్థానికులు, పర్యాటకులు వ్యాన్‌ను కాపాడటానికి ప్రయత్నించినప్పటికీ, వారి ప్రయత్నాలు ఫలించలేదు.
అదృష్టవశాత్తు, ఈ సంఘటనలో ఎవ్వరూ గాయపడలేదు.ఐస్‌క్రీమ్ వ్యాన్( Ice Cream Van )లో ఎవరూ లేనట్లు తేలింది.
ఈ ఘటన స్థానికులను ఆశ్చర్యపరిచింది.చాలా మంది ఈ సంఘటన చాలా వింతగా, చిత్రంగా ఉందని అన్నారు.
ఈ సంఘటన జరిగినప్పుడు, చుట్టూ ఉన్న వారు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఆ వీడియోలలో ఐస్‌క్రీమ్ వ్యాన్‌ను అలలు ముంచినట్లు, అది కొట్టుకుపోయినట్లు కనిపించింది. """/" /
కోస్ట్ గార్డ్ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం, రాత్రి 9:45 గంటల సమయానికి నీటి మట్టం తగ్గిన తర్వాత ఓ రికవరీ వాహనం సహాయంతో ఐస్‌క్రీమ్ వ్యాన్‌ను సముద్రం నుంచి బయటకు తీశారు.
"""/" /
పాడ్‌స్టో కోస్ట్ గార్డ్ ప్రతినిధి మాట్లాడుతూ, "నిన్న సాయంత్రం 5 గంటలకు ముందు, కార్న్‌వాల్( Cornwall )లోని హార్లన్ బే లో అలల్లో చిక్కుకున్న ఐస్ క్రీమ్ వ్యాన్ గురించి మాకు సమాచారం అందింది.
సంఘటనా స్థలానికి పాడ్‌స్టో కోస్ట్ గార్డ్ రెస్క్యూ టీమ్, RNLI లైఫ్ గార్డ్‌లు చేరుకుని అక్కడ ఉన్న వారి భద్రతను నిర్ధారించారు.
రాత్రి 9:45 గంటల సమయానికి నీటి మట్టం తగ్గగానే, యజమాని ఏర్పాటు చేసిన రికవరీ వాహనం సహాయంతో ఐస్ క్రీమ్ వ్యాన్‌ను బయటకు తీశారు.
తర్వాత, వ్యాన్‌ను సురక్షిత ప్రదేశానికి తరలించాం." అని చెప్పారు.
గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?