భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాళ్లకుంట చెరువులో వలకు చిక్కిన వింత చేప..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలం, అప్పారావుపేట గ్రామంలోని రాళ్లకుంట చెరువు గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నిండడంతో స్థానికులు చేపలు వేటకు చెరువుకి వెళ్లారు.

గ్రామస్థుల వలకు అరుదైన వింత చేప చిక్కింది.చూడడానికి ఆశ్చర్యంగా ఉన్న చేప దొరకడంతో చేపను పట్టుకున్న వ్యక్తి దానిని ఇంటికి తీసుకుని వచ్చాడు.

చుట్టుప్రక్కల వారికి విషయం తెలియడంతో అరుదైన వింత చేపను చూసేందుకు స్థానికులు అధిక సంఖ్యలో వచ్చారు.

సాధారణ చేపల కంటే భిన్నంగా నోరు క్రిందకు ఉండి, విచిత్రంగా శబ్దాలు చేస్తూ, ఇప్పటివరకు ఎప్పుడూ చూడని విధంగా చేప ఆకృతి ఉండడంతో అరుదైన వింత చేపను చూసేందుకు జనం ఎగబడ్డారు.

ఆనోటా ఈనోటా విషయం బయటకు చేరడంతో స్థానికంగా వింత చేప విషయం వైరల్ అయింది.

Méthodes De Paiement Et Gestion De Bankroll Pour Les Joueurs Français