ఆదిలాబాద్ జిల్లాలో వింత వ్యాధి

వర్షాకాలం ప్రారంభం అయితే చాలు సీజనల్ వ్యాధుల ప్రభావం ఎక్కువగానే ఉంటాది.అయితే ఈసారి సీజనల్ వ్యాధులతో పాటు కరోనా వైరస్ కూడా విజృంభిస్తుంది.

దింతో ప్రజలు అయోమయస్థితిలో జీవనం సాగిస్తున్నారు.ఇది ఇలా ఉంటే తెలంగాణలో ఆదిలాబాద్‌ జిల్లాలో మరో అరుదైన వ్యాధి వెలుగులోకి వచ్చింది.

లెప్టోస్పిరోసిస్ అనే ఈ వ్యాధి అచ్చం పచ్చకామెర్ల రూపంలో ఉంటుంది.ఈ వింత వ్యాధిని జిల్లా వైద్యాధికారులు గుర్తించారు.

అయితే ఈ వ్యాధి ఎక్కువగా మురికి వాడ్లలో వ్యాపిస్తుందని వైద్య నిపుణులు వెల్లడించారు.

అయితే ఈ వ్యాధి సోకిన వారి కళ్ళు పచ్చగా మారిపోయి పచ్చకామర్లకు తలపిస్తాయి.

అంతేకాదు ఈ వ్యాధి సోకిన వారు జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, చలి, వాంతులు వంటి లక్షణాలతో బాధపడుతుంటారు.

అయితే చాల మంది ఈ లక్షణాలు చూసి పచ్చకామర్లకు వచ్చాయని భావించి ఆ వ్యాధికి సంబంధించిన చికిత్స తీసుకుంటారు.

ఆలా చేయడంతో ఈ వ్యాధి ఏ మాత్రం తగ్గకుండా దీని ప్రభావం కాలేయం, కిడ్నీలపై చూపుతుంది.

దింతో ఈ అవయాలు పూర్తిగా ఖరాబ్ అయ్యి ఏకంగా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది.

అయితే ఈ వ్యాధిని సకాలంలో గుర్తించినట్లయితే వైద్యంతో దీనికి చెక్ పెట్టొచ్చని వైద్య నిపుణులు తెలిపారు.

ఇండస్ట్రీలో బోలెడంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ సొంత కాళ్ళ పైన ఎదుగుతున్న నటీనటులు