వింత ఆచారం.. దేశమంతా దసరా కానీ ఆ గ్రామంలో మాత్రం శ్రీరామనవమి..

ఇదేంటి దేశమంతా విజయదశమి వేడుకను ఘనంగా జరుపుకుంటుంటే ఇక్కడ ఏంటి సీతారాములోరి కళ్యాణం జరుగుతోంది అనుకుంటున్నారా.

మీరు చూస్తున్నది నిజమే.సరిగ్గా దసరా విజయ దశమి రోజునే ఇక్కడ సీతా రాముల వారి కళ్యాణం ఘనంగా నిర్వహిస్తారు.

తూర్పుగోదావరి జిల్లా అమలాపురం రూరల్ మండలం పేరూరు గ్రామం లోని భీమభక్తుని పాలెం లో ఈ వింత సాంప్రదాయం ఉంది.

ఇదే గ్రామంలో దసరా వేడుకలు కూడా ఘనంగా జరుగుతాయి.కానీ ఇక్కడ మాత్రం రాములోరి కల్యాణం మాత్రం అంతకంటే ఘనంగా జరుగుతుంది.

విజయదశమి రోజున శ్రీరామ నవమి చేయడం వందల ఏళ్లుగా వస్తున్న ఆచారం అని చెబుతారు స్థానికులు.

ఉదయం రామాలయంలో పూజలు నిర్వహించి రాత్రికి కల్యాణం చేయడం అక్కడ ఆనవాయితీగా వస్తోంది.

ఇంతకీ ఈ ఆచారం వెనుక అసలు కథ చూస్తే అప్పటి సంప్రదాయాన్ని ఇప్పటి వరకు ఏమి నిర్వహిస్తున్నారు అనుకుంటారు అంతా.

ఇంతకీ ఈ సాంప్రదాయం వింత కథేంటంటే ఇక్కడి పూర్వీకులు పనులు లేక వలస వెళ్లేవారు.

శ్రీరామ నవమి వేడుక ఏప్రిల్ మాసంలో జరుగుతుంది.ఆ సమయంలో ఇక్కడ పూర్వికులు అంతా వేరే ప్రాంతాలకు పనులు కోసం వలస వెళ్లడంతో తమ ఆరాధ్య దైవమైన సీతారామలక్ష్మణులు పూజించుకునే పర్వదినమైన శ్రీరామనవమిని పండుగను మిస్సయ్యే వారట.

"""/"/ దీంతో వారంతా పనులు ముగించుకుని సొంత ఊళ్లకు వచ్చిన తర్వాత దసరా పండుగ సందర్భంగానే తన ఇష్టదైవమైన రాములోరి కళ్యాణాన్ని ఘనంగా జరిపించుకునే వారట.

ఇది ఈ సాంప్రదాయం వెనక అసలు కథ.ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఈ గ్రామస్తులు ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు.

దేశమంతా విజయదశమి వేడుకలు జరుగుతుంటే అక్కడ మాత్రం శ్రీరామ నవమి కల్యాణం జరగడం విశేషం కావడంతో సమీప ప్రాంతాల ప్రజలు రాత్రి జరిగే కళ్యాణ మహోత్సవానికి ఇక్కడికి వచ్చి సీతారాముల కల్యాణాన్ని భక్తిశ్రద్ధలతో వీక్షిస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం..!