కుందేలును గుటుక్కున మింగేసిన వింత పక్షి.. చివరికి..!?
TeluguStop.com
సోషల్ మీడియా విస్తృతంగా ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత ప్రపంచంలో ఏమూల ఏ వింత జరిగినా మారుమూల గ్రామాల్లో ఉన్న వారికి సైతం తెలుస్తోంది.
అది రాజకీయ అంశమైనా, క్రీడలకు సంబంధించినదైనా, సినిమా వార్తలైనా, మరే ఇతర ప్రాధాన్యత ఉన్న అంశమైనా క్షణాల్లో వైరల్ అయిపోతుంది.
కోట్ల కొలదీ యూజర్ల వద్దకు చేరిపోతోంది.కొన్ని నవ్విస్తే మరికొన్ని కవ్విస్తాయి.
ఇటీవల ఓ వీడియో సోషల్ మీడియాలో నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తోంది.దానిని చూసిన వారంతా ఔరా అనుకుంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.
దీనికి సంబంధించిన విశేషాలిలా ఉన్నాయి.ఏర్లు, కాలువలు, నదుల వద్ద కొంగలు వాలుతుంటాయి.
చటుక్కున చేపలను నోట కరుచుకుని ఆకలి బాధ తీర్చుకుంటాయి.అయితే ఓ బ్రతికున్న కుందేలు పిల్లను మింగగలవా అంటే అంతా అసాధ్యం అని చెప్పేస్తారు.
తాజాగా పాపులర్ అయిన ఓ వీడియోలో మాత్రం కొంగను పోలిన ఓ పక్షి నిజంగానే అన్నంత పనీ చేసింది.
అచ్చం కొంగలా కనిపించే ఆ పక్షి పేరు 'హెరాన్'.దీనికి తెలివి చాలా ఎక్కువ.
నీటిలోకి చప్పుడు కాకుండా దిగుతుంది.చేపలను గుటుక్కున మింగేస్తుంది.
అంతేకాకుండా ఎలుకలు, పాములు, కుందేళ్లను సైతం అవలీలగా స్వాహా చేస్తోంది.దీంతో పాటు కనిపించిన పక్షిని కూడా తినేయడం దీనికి చాలా అలవాటు.
ఇది కనిపిస్తే చాలు.ఆయా జంతువులు చిగురుటాకులా వణికిపోతాయి.
తమకు మూఢిందని అర్థం చేసుకుంటాయి.కనిపించిన జంతువును మింగి ఆకలి తీర్చుకునే 'హెరాన్'కు ఓ మంచి అలవాటు కూడా ఉంది.
ఏ జంతువునైనా తినే ముందు నీటిలో రెండు సార్లైనా కడుగుతుంది.అలా కడిగిన తర్వాతే మింగుతుంది.
ఈ జంతువుకు ఉండే ఈ ప్రత్యేకతను తెలుసుకున్న వారంతా ఆశ్చర్యపోతున్నారు.మనుషులు సైతం శుభ్రత లేకుండా చాలా మంది కనిపిస్తుంటారు.
చేతులు కడుక్కోకుండానే తినేస్తుంటారు.వారందరికీ ఈ హెరాన్ భిన్నమని కొందరు నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.
బుల్లితెరపై డిజాస్టర్ గా నిలిచిన కల్కి 2898 ఏడీ మూవీ.. రేటింగ్ తెలిస్తే షాకవ్వాల్సిందే!