అందమైన యువతి వెనుక...భయంకరమైన గతం.! ఇది నోబెల్ విజేత జీవితం.
TeluguStop.com
ప్రతి ఏటా ప్రపంచ వ్యాప్తంగా ఆయా రంగాల్లో ఘనత సాధించిన పలువురు వ్యక్తులకు నోబెల్ బహుమతి ఇస్తారని అందరికీ తెలిసిందే.
అయితే ఈ సారి ఇరాక్‌కు చెందిన నదియా మురద్‌తోపాటు కాంగోకు చెందిన వైద్యుడు డెనిస్ ముక్‌వెగెకు కూడా నోబెల్ శాంతి బహుమతి లభించింది.
కాగా నదియా మురద్‌కు నోబెల్ శాంతి బహుమతి అంత తేలిగ్గా ఏమీ రాలేదు.
ఆమె ఈ స్థాయికి రావడానికి కారణం.ఇరాక్‌లో ఉన్న యాజిదీ యువతులను రక్షించాలని ఉద్యమం చేయడమే.
అదే ఆమెకు నోబెల్ పురస్కారాన్ని సాధించి పెట్టింది.అయితే నిజానికి నదియా కుటుంబం కూడా యాజిదీ వర్గానికి చెందుతుంది.
ఇరాక్‌లో యాజిదీలు ఎక్కువగా సింజర్ ప్రాంతంలో నివసిస్తారు.ఇది సిరియా సరిహద్దుకు దగ్గర్లో ఉంటుంది.
అక్కడే నదియా కుటుంబం నివాసం ఉండేది.అయితే అక్కడ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ప్రాబల్యం ఎక్కువ.
వారు చేసే అకృత్యాలకు లెక్కే లేదు.వారు యాజిదీ స్త్రీల పట్ల దుర్మారంగా వ్యవహరిస్తారు.
కాగా 2014లో ఐసిస్ ఉగ్రవాదులు నదియా ఉంటున్న గ్రామమైన కోచోలో చొరబడ్డారు.వారు పురుషులందరినీ చంపేశారు.
చిన్న పిల్లలను బంధించి ఉగ్రవాదులుగా శిక్షణ ఇచ్చేందుకు తీసుకువెళ్లారు.ఇక వేలాది మంది యాజిదీ మహిళలను, యువతులను పనివారుగా, లైంగిక బానిసలుగా మార్చేశారు.
ఆ క్రమంలో ఐసిస్ ఉగ్రవాదులు నదియాను కూడా అపహరించారు.కొన్ని నెలల పాటు ఆమెను బంధించి ఆమెపై ఉగ్రవాదులు సామూహికంగా అత్యాచారం చేసేవారు.
ప్రతిఘటిస్తే తీవ్రంగా హింసించేవారు.రక్తం వచ్చేట్లు కొట్టేవారు.
ఇక లైంగిక బానిసలు కాని మహిళలు, యువతులను ఉగ్రవాదులు మార్కెట్లో అమ్మేవారు.
దీంతోపాటు వారిని బలవంతంగా ఇస్లాంలోకి మార్చి వివాహాలు చేసుకునేవారు.అలాగే సంప్రదాయ బద్దంగా ఉండే అమ్మాయిల చేత బలవంతంగా మేకప్ వేయించి, బిగుతైన దుస్తులు ధరింపజేసేవారు.
అనంతరం వారిపై ఇష్టాను సారంగా చేతులు వేసి అసభ్య చర్యలకు పాల్పడేవారు.అయితే ఈ ఇబ్బందులన్నింటినీ నదియా ఎదుర్కొంది.
కానీ ఒక రోజు ఓ ముస్లిం కుటుంబం సహాయంతో ఆమె మోసుల్ నగరం నుంచి తప్పించుకుని నకిలీ పత్రాలతో యాజిదీలు ఉండే సహాయక శిబిరాలకు చేరుకుంది.
అనంతరం అక్కడి నుంచి ఓ సంస్థ సహాయంతో జర్మనీకి చేరుకుంది.అయితే అప్పటికే నదియా తల్లి, ఆరుగురు సోదరులు మృతి చెందారు.
జర్మనీలో తన సోదరి ఉందని తెలుసుకుని నదియా అక్కడికి వెళ్లింది.ఇప్పుడు కూడా ఆమె అక్కడే ఉంటోంది.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
అయితే జర్మనీ చేరుకున్నాక నదియా యాజిదీ యువతులు, మహిళలను విడిపించడం కోసం ఉద్యమించింది.
అనేక సందర్భాల్లో తన గళాన్ని వినిపించింది.దాదాపుగా 3వేల మంది యాజిదీ మహిళలు కనిపించకుండా పోయారని, వారిని రక్షించాలని కోరుతూ ఉద్యమాలను చేపట్టింది.
దీంతోపాటు తనపై జరిగిన అకృత్యాలను కూడా వివరించేది.అలా ఒకసారి నదియా 2015లో ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలో మాట్లాడుతూ.
తన దీన గాథను కళ్లకు కట్టినట్లు వివరించింది.దీంతో నదియా ధైర్య సాహసాలకు మెచ్చిన ఐక్య రాజ్య సమితి ఆమెను గుడ్‌విల్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది.
ఈ క్రమంలోనే నదియా 2017లో తన జీవిత గాథపై రాయబడిన ది లాస్ట్ గర్ల్ అనే పుస్తకాన్ని కూడా విడుదల చేసింది.
ఐసిస్ ఉగ్రవాదులు చేస్తున్న అకృత్యాలను ఆపాలని, యాజిదీ యువతులు, మహిళలను రక్షించాలని, ఉగ్రవాదుల దుశ్చర్యలకు చెక్ పెట్టాలని, ఇలాంటి ఘాతుకాలకు పాల్పడే ఉగ్రవాదులను తుదముట్టించాలని కోరుతూ నదియా పోరాటం చేస్తోంది.
అందుకనే ఆమెకు ఈసారి నోబెల్ శాంతి బహుమతి లభించింది.నిజంగా ఇది మహిళలందరికీ దక్కిన గౌరవమే కదా.