చిరు తన రూమ్ మేట్స్ కి సహాయం చేయలేదని తప్పుగా అనుకునేవాళ్లకు ఇదే సమాధానం !

చిరంజీవి స్టార్ హీరో గా, మెగా స్టార్ గా టాలీవుడ్ తో పాటు పాన్ ఇండియా వ్యాప్తంగా కొనసాగుతున్నాడు.

1978 లో ప్రాణం ఖరీదు సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం నేడు గాడ్ ఫాదర్ సినిమా వరకు అయన సినీ ప్రయాణం లో ఎన్నో అవరోధాలు చూసారు.

అయినా ఎక్కడ తలవంచక తనదైన నటన తో చక్కటి కథలను ఎంచుకుంటూ స్టార్ హీరో గా ఎదిగాడు.

అయితే చిరంజీవి సినిమా ప్రయాణం మొదలయ్యాక ఎక్కడ ఆగలేదు కానీ సినిమాల్లోకి రాక ముందు మాత్రం చెన్నై లో సినిమా అవకాశాల కోసం చాలానే కష్ట పడ్డాడు.

సినిమాల్లో హీరో అవుతాను అని చెప్పి ఇంటి నుంచి బయలు దేరి వెళ్లి చెన్నై లో ఒక అద్దె గదిలో ఉంటూ సినిమా ప్రయత్నాలు చేసాడు.

అతడితో పాటు హరి ప్రసాద్, నారాయణ రావు, సుధాకర్ వంటి నటులు కూడా ఒకే రూమ్ లో ఉండేవారు.

అయితే చిరంజీవి ఇంత పెద్ద స్టార్ అయినా కూడా తనతో పాటు తొలినాళ్ళ నుంచి కష్టాలు పడిన తన రూమ్ మేట్స్ మాత్రమే ఆయనలా పెద్దగా క్లిక్ అవ్వలేదు.

ఏవో కొన్ని సినిమాల్లో నటించిన కూడా చిరంజీవి స్థాయిని మాత్రం చేరుకోలేదు.కాల గమనంలో తనతో రూమ్ పంచుకున్న వాళ్లలో ఒక్కరు కూడా నటనలో మేటి అయినా ఆర్థికంగా మాత్రం మంచి పొజిషన్ లో లేరు.

అయినా కూడా చిరంజీవి తన స్నేహితులను ఆదుకోలేదని టాలీవుడ్ తో పటు సోషల్ మీడియా లో సైతం అనేక పోస్ట్స్ వైరల్ అయ్యాయి.

"""/"/ అయితే ఎవరికి తెలియని విషయం ఏమిటి అంటే చిరంజీవి స్టార్ హీరో అయ్యాక తన స్నేహితుల కోసం చాల ఆరాటపడేవాడు.

సుధాకర్ తమిళ్ లో హీరోగా చేసి ఆ తర్వాత కమెడియన్ గా తెలుగు లో మంచి స్థాయిలోనే ఉన్నాడు.

ఇక నారాయణ రావు సైతం సినిమాల్లో నటిస్తూనే నిర్మాణం కూడా చేపట్టి సినిమాలను నిర్మించాడు.

హరి ప్రసాద్ సైతం కన్నడ ఇండస్ట్రీ లో బాగానే సినిమాలు చేసిన తెలుగు మరియు తమిళ్ లో అంతగా ఆకట్టుకోలేకపోయాడు.

"""/"/ అయితే తన ముగ్గురి స్నేహితుల కోసం డైనమిక్ మూవీస్ అనే బ్యానర్స్ స్థాపించి యముడికి మొగుడు అనే సినిమా నిర్మించి ఆ సినిమాల్లో వచ్చిన లాభాలను తన స్నేహితులకు పంచి ఆ సినిమా నెగటివ్ ని తన భార్య సురేఖ పేరు పై తీసుకున్నాడు.

ఆ బ్యానర్ లో అదే మొదటి మరియు చివరి సినిమా.ఆ సినిమా తర్వాత ముగ్గురు స్నేహితులు వచ్చిన డబ్బుతో తమ తమ పనుల్లో బిజీ అయ్యారు.

ఇలా కేవలం రూమ్ మేట్స్ అయినందుకు సినిమా తీసిపెట్టడం ఎంత మందికి సాధ్యం చెప్పండి.

ఆ సౌత్ డైరెక్టర్ నాతో ఇబ్బందికరంగా ప్రవర్తించాడు.. ఉపాసన సింగ్ కామెంట్స్ వైరల్!