లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో నటించిన ఈ నటుడు ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాడో తెలుసా ?

2012లో శేఖర్ కమ్ముల తీసిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా ఎంత మందికి గుర్తుంది చెప్పండి .

ఎంతో అద్భుతమైన ఫీల్ తో, ఫ్రెష్ కాస్టింగ్ తో తెలుగు వారి హృదయాలను గెలుచుకున్నాడు దర్శకుడు శేఖర్ కమ్ముల.

ఈ సినిమాలో నటీనట్లంతా కొత్త వారే కావడంతో చూసేవారికి ఎంతో మంచి ఫ్రెష్ ఫీలింగ్ కలిగింది.

ముఖ్యంగా ఈ సినిమాలో ముగ్గురు కొత్త కుర్రాళ్లను హీరోలుగా పరిచయం చేసాడు శేఖర్.

వారే అభిజిత్, సుధాకర్ మరియు కౌశిక్.అంతే కాకుండా నవీన్ పోలిశెట్టి, విజయ్ దేవరకొండ వారికి సైతం ఈ సినిమాతో మొదటి అవకాశం దొరకడం కూడా విశేషం.

ఈ సినిమాలో నటించిన నటీనటులంతా కూడా ప్రస్తుతం చాలామంది అమెరికాలో సెటిల్ కాగా నవీన్ మరియు విజయ్ దేవరకొండ మాత్రమే టాలీవుడ్ లో స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు.

అయితే ఇక్కడ ఎవరు ఊహించని విధంగా ముగ్గురు హీరోల్లో ఒక చిన్న పిల్లాడిలా కనిపించే క్యారెక్టర్ ని సృష్టించాడు శేఖర్ కమ్ముల.

అతడే కౌశిక్ .సినిమాలో అభి అనే పాత్ర పోషించాడు.

ఇతనికి కాంబినేషన్ గా శ్రీయ శరణ్ నటించడం విశేషం.ఈ కాంబినేషన్ కి ఈ సినిమాలో మంచి మార్కులు పడ్డాయి.

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా వచ్చి ఇప్పటికే దాదాపు పది సంవత్సరాలు గడిచిపోయింది.

గడిచిన దశాబ్దంలో ఈ సినిమాలో నటించిన వారు వారి జీవితాల్లో సెటిల్ అయిపోయారు.

"""/"/ ఎవరు ఊహించని విధంగా ఈ చిత్రంలో నటించిన కౌశిక్ ఫుల్ బిజీగా ఉన్నాడు కెరియర్ లో.

మళ్ళీ ఏ సినిమాలో కూడా నటించని కౌశిక్ ప్రస్తుతం న్యూయార్క్ లో సైంటిస్ట్ గా సెటిల్ కావడం చాలా మందికి ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

వాస్తవానికి కౌశిక్ చదువులు కూడా న్యూయార్క్ లోనే పూర్తి చేశాడు .అక్కడే రీసెర్చ్ స్కాలర్ గా కూడా జాయిన్ అయ్యాడు.

ప్రస్తుతం సైంటిస్ట్ గా పని చేస్తున్నాడు.ఇటీవల సోషల్ మీడియాలో తన ఫోటోలను అప్లోడ్ చేయడంతో ఈ విషయం బయటకు తెలిసింది.

ఇలా అప్పుడెప్పుడో కనిపించి మాయమైన కౌశిక్ ఒక సైంటిస్ట్ గా సేవలు అందించడం నిజంగా చాలా గొప్ప విషయం అని చెప్పాలి.

చూడటానికి ఇప్పటికి అచ్చం లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో ఉన్నట్టుగానే ఉన్నా కానీ పెద్ద స్థాయిలో ఉండడం అది తెలుగు వాడికి గర్వకారణం అనే చెప్పాలి.

కెనడా ప్రధాని రేసులో భారత సంతతి ఎంపీ.. అనితకు గట్టిపోటీ తప్పదా?