ఆ ప్రాంతంలో అలుముకున్న న్యూక్లియర్ బాంబ్ లాంటి పొగలు.. షాకింగ్ వీడియో వైరల్…

ప్రకృతి చాలా అనూహ్యమైనది.అది ఎప్పుడూ ఎలా మారుతుందో మన ఊహించలేం.

కొన్నిసార్లు ఆకాశంలో కనిపించే దృశ్యాలు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి.మరికొన్నిసార్లు భయభ్రాంతులకు గురిచేస్తాయి.

తాజాగా ఆ కోవకు చెందిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

గత కొద్ది రోజులుగా అమెరికా( America ) దేశంలోని ఓక్లహోమా రాష్ట్రంలోని కొన్ని కౌంటీలలో బేస్‌బాల్‌ల కంటే పెద్ద వడగండ్ల వానలు( Hailstorm ) కురుస్తున్నాయి.

ఈ వడగళ్ల వాన కారణంగా శనివారం ఓక్లహోమాలోని నార్మన్ సిటీలో న్యూక్లియర్ బాంబు( Nuclear Bomb ) పేలితే ఆకాశంలోకి ఎలా పొగలు అలుముకుంటాయో ఆ విధంగా మేఘాల నిర్మాణం కనిపించింది.

"""/" / అసాధారణమైన పుట్టగొడుగు ఆకారంలో ఉన్న ఆరంజ్ కలర్ క్లౌడ్స్ స్థానికంగా చాలామందిలో ఆందోళన కలిగించాయి.

కొందరు ఈ వింత దృశ్యాన్ని తమ ఫోన్‌ కెమెరాల్లో బంధించారు.నగర వాసులు వాటిని సోషల్ మీడియాలో కూడా షేర్ చేశారు.

అవి కాస్త వైరల్ అవుతున్నాయి.శని, ఆదివారాల్లో సెంట్రల్ ఓక్లహోమాలో( Central Oklahoma ) అనేక భారీ ఉరుములు వచ్చాయి.

సుడిగాలి వచ్చే ప్రమాదం ఉందని కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.ఈ ప్రాంతంలోని నేషనల్ వెదర్ సర్వీస్(NWS) స్టేషన్ కొన్ని ప్రదేశాలలో అతిపెద్ద వడగళ్ళు కురిసినట్లు ఆదివారం వెల్లడించింది.

"""/" / సరిగ్గా ఇలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులే సెంట్రల్ టెక్సాస్‌లో కూడా నెలకొంటున్నాయి, రౌండ్ రాక్‌తో సహా కొన్ని ప్రాంతాలలో పెద్ద వడగళ్ళు కురుస్తూ స్థానికులు ఇంటి నుంచి బయట అడుగుపెట్టనివ్వకుండా చేస్తున్నాయి.

వడగళ్ల వానల వల్ల పార్క్ చేసిన కార్ల విండోస్ ధ్వంసం అయ్యాయి.రౌండ్ రాక్‌లో ఒక కారు విండ్‌షీల్డ్ లేదా వెనుక కిటికీ ఊడిపోయాయి.

దీనివల్ల బయట పార్క్ చేయాలంటేనే చాలామంది భయపడుతున్నారు.

CMR: గర్ల్స్ హాస్టల్‌లో రహస్యంగా 300 వీడియోలు రికార్డ్?