ఒక్క క్షణం విలువ.. పసివాడి ప్రాణం
TeluguStop.com
ఒక్క క్షణం విలువ దాన్ని కోల్పోయిన వారిని అడిగితే తెలుస్తుందని అంటుంటారు.అలాంటిది ఒక్క క్షణంలో రెప్పపాటున ఓ పసివాడి ప్రాణాన్ని కాపాడాడు ఓ వ్యక్తి.
ఓ దుకాణంలో క్యాష్ కౌంటర్‌పై నుండి పడబోయిన ఓ చిన్నపిల్లాడిన సదరు షాపు యజమాని పట్టుకోవడంతో ఆ బుడతడు బతికి బట్టకట్టాడు.
అమెరికాలోని యూటా రాష్ట్రంలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇద్దరు మహిళలు చంటిబిడ్డతో ఓ షాపుకు వెళ్లారు.అక్కడ అతడిని క్యాష్ కౌంటర్‌పై కూర్చోబెట్టి సేల్స్‌గర్ల్‌తో ముచ్చట్లు సాగించారు.
కాగా ఇదే క్షణంలో ఆ బుడతడు అదుపు తప్పి కిందపడిపోయాడు.దీన్ని వారు గమనించలేకపోయారు.
అప్పుడే అటువైపు వస్తున్న షాపు యజమాని ఆ పిల్లాడిని గమనించి పరిగెత్తుకుంటూ వచ్చి తన చేతులతో పట్టుకున్నాడు.
దీంతో ముగ్గురు మహిళలు కూడా అవాక్కయ్యారు.తమ బిడ్డ ప్రాణాలు కాపాడినందుకు ఆ ఇద్దరు మహిళలకు సదరు షాపు యజమానికి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆ మహిళలపై విరుచుకుపడుతున్నారు.
పిల్లాడిని కనిపెట్టలేని ఆ మహిళలు అతడిని షాపుకు ఎందుకు తీసుకెళ్లారంటూ కామెంట్లు విసురుతుండగా, మరికొందరు ఆ షాపు యజమానిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
అప్పుడు బస్సులో ఇప్పుడు లోకల్ ఛానల్ లో.. గేమ్ ఛేంజర్ ప్రసారంపై నిర్మాత సంచలన వ్యాఖ్యలు!