ఆమెను సినిమాల్లోకి తీసుకోవడం ఆపేయాలి.. స్టార్ కిడ్ పై షాకింగ్ ట్రోల్స్!

ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం అందరిలో ఉందని చెప్పవచ్చు.ఏ విషయమైనా సోషల్ మీడియా ద్వారా క్షణాల్లో తెలుసుకుంటున్నారు.

ముఖ్యంగా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రేటిల వ్యక్తిగతం విషయంలో మాత్రం సోషల్ మీడియా బాగా సహాయపడుతుంది.

వారిని నేరుగా అడగాల్సిన ప్రశ్నలు కూడా అడుగుతుంటారు ఫాలోవర్స్.ముఖ్యంగా వారిని ఏదైనా విషయంలో విమర్శించాలన్నా కూడా సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తున్నారు.

నేరుగా నెగిటివ్ కామెంట్లు, ట్రోల్స్ చేస్తున్నారు.దీంతో సెలబ్రెటీలు కొన్ని సందర్భాలలో ఆ ట్రోలింగ్స్ కు స్పందించి వాటికీ తగ్గట్లు రీ కౌంటర్ లు వేస్తున్నారు.

కొందరు మాత్రం సైలెంట్ గా సాఫ్ట్ గా స్పందిస్తున్నారు.ఇదంతా పక్కన పెడితే తాజాగా ఒక హీరోయిన్ పై దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

ఏకంగా సినిమాల్లోకి తీసుకోవడం ఆపేయాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇంతకు ఆ హీరోయిన్ ఎవరో కాదు.

ఇటీవలే లైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోయిన్ అనన్య పాండే.ఈ సినిమాతోనే తొలిసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది.

బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ అనన్య పాండే తన అందంతో, నటనతో ప్రేక్షకుల హృదయాలను సంపాదించుకుంది.

ఎక్కువగా హిందీ సినిమాలలో నటించిన ఈ బ్యూటీ సినీ ఇండస్ట్రీకి అతి తక్కువ సమయంలో పరిచయమై మంచి అభిమానాన్ని సొంతం చేసుకుంది.

2019 లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ -2 సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది.

తొలి సినిమాతోనే తన నటనకు అవార్డులు కూడా సొంతం చేసుకుంది.అదే ఏడాది మరో సినిమాలో కూడా నటించింది.

ఇక వరుసగా అవకాశాలు కూడా అందుకుంటుంది ఈ బ్యూటీ.ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.

"""/"/ తన ఫోటోల షేర్ల తో అందర్నీ ఆకట్టుకుంటుంది.అంతేకాకుండా తన హాట్ ఫోటోలతో బాగా రచ్చ రచ్చ చేస్తుంది.

ఇటీవలే లైగర్ సినిమాతో తెలుగు పేక్షకుల ముందుకు రాగా ఈ సినిమాలో ఈమె నటన తీరు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

దీంతో ఓ రేంజ్ లో ఆమెను బాగా ట్రోల్స్ చేస్తున్నారు.ఆమెను సినిమాలోకి తీసుకోవడం ఆపండి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇన్ని సంవత్సరాలలో ఆమె నటన ఎవ్వర్ని ఆకట్టుకోలేకపోయింది అంటూ.అసలు తనది నటన నేనా అంతేకాకుండా ఆమెను సినిమాల్లోకి ఎలా తీసుకున్నారు అంటూ పైగా ఆమెను స్టార్ కిడ్ అంటూ బాగా ఎత్తుకు లేపడుతున్నారు అంటూ కామెంట్లు వస్తున్నాయి.

ఎలాగైనా ఆమెను సినిమాలోకి తీసుకోవడం ఆపాలి అంటూ లేదంటే ఆమె వల్ల సినిమాలు ప్లాప్ అవుతాయి అని అంటున్నారు.

మరి ఈ విషయం గురించి అనన్య పాండే ఎలా స్పందిస్తుందో చూడాలి.

వీడియో: తాత కిల్లర్ స్టెప్పులు.. ఆ పాటకు డ్యాన్స్ ఫ్లోర్‌ను షేక్ చేశాడంతే!