సీ విజిల్‌’తో అక్రమాలకు అడ్డుకట్ట

ప్రతి ఒక్కరూ తమ స్మార్ట్ మొబైల్ లో సీ విజిల్‌ అప్లికేషన్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి రాజన్న సిరిసిల్ల జిల్లా:ఎన్నికల కమిషన్‌ రూపొందించిన సీ విజిల్‌ యాప్‌( Cvigil App )ను ప్రజలు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు.

ఈ మేరకు జిల్లా కలెక్టర్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.అభ్యర్థులు పార్టీల ఏజెంట్లు ప్రతినిధులు , ప్రజలు తమ స్మార్ట్ మొబైల్ లో సి - విజిల్ ను డౌన్లోడ్ చేసుకోవడంతో పాటు ప్రజలు కూడా దానిని డౌన్లోడ్ చేసుకునేలా చైతన్యం చేయాలన్నారు.

ఎన్నికలలో ఎలాంటి ప్రలోభాలకు గురి చేసినా, క్షేత్ర స్థాయిలో ఎన్నికల లో అక్రమాలు జరుగుతున్నట్లు గుర్తించిన వెంటనే సి విజిల్ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయాలని జిల్లా కలెక్టర్( District Collector ) అన్నారు.

ఫిర్యాదుదారుడి పేరు గోప్యంగా ఉంచుతామని అన్నారు.100 నిమిషాల్లో ఫిర్యాదులు పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ చెప్పారు.

ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని జిల్లాలో ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా ఎన్నికలు జరిగేలా ప్రజలు తమవంతు సహకారం అందించాలని కోరారు.