విజయవాడలో సీఎం జగన్ పై రాయితో దాడి..!!

ఏపీ సీఎం వైఎస్ జగన్ "మేమంతా సిద్ధం( Memantha Siddham )" బస్సు యాత్ర విజయవాడలో సాగుతోంది.

ఈ క్రమంలో సరిగ్గా సింగ్ నగర్ సమీపించగా సీఎం జగన్ పై ఆగంతకులు రాయితో దాడి చేయడం జరిగింది.

అత్యంత వేగంగా సీఎం జగన్ కనుబొమ్మకు రాయి తగలడం జరిగింది.క్యాట్ బాల్ తో దాడి చేసినట్లు భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి.

బస్సు పైన జగన్ ఉన్న సమయంలో.ఒక్కసారిగా ప్రజలు పూలు జల్లుతుండగా.

జగన్ ఎడమ కంటికి రాయి తాగడం జరిగింది.ఈ ఘటన జరిగిన అనంతరం బస్సు పై నుండి.

లోనికి వెళ్లి యధావిధిగా.ముందు సీటులో కూర్చుని ప్రజలకు అభివాదం చేశారు.

ఇదే సమయంలో సీఎం జగన్( CM Jagan ) కి వైద్యులు ప్రథమ చికిత్స అందించారు.

ఈ దాడి తెలుగుదేశం పార్టీ చేసిందని విజయవాడ వైసీపీ నాయకులు భావిస్తున్నారు. """/" / నేడే గుంటూరు జిల్లా నుండి వారధి మీదగా విజయవాడలో బస్సు యాత్ర సమీపించింది.

ఈ క్రమంలో సింగ్ నగర్ లో.జగన్ పై రాయి దాడి జరగటం సంచలనంగా మారింది.

ఏపీలో ఎన్నికలకు ఇంక నెలరోజులు మాత్రమే సమయం ఉంది.ఎట్టి పరిస్థితులలో అధికారం చేజారిపోకుండా వైయస్ జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

ఇప్పటికే వైసీపీ పార్టీకి సంబంధించి పోటీ చేసే అసెంబ్లీ మరియు పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించడం జరిగింది.

ఆ తర్వాత "మేమంతా సిద్ధం" పేరిట బస్సు యాత్ర స్టార్ట్ చేశారు.ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు 21 రోజులు పాటు యాత్ర నిర్వహించాలని నిర్ణయించారు.

ఇప్పటికే రాయలసీమ ప్రాంతంలో కంప్లీట్ అయిన యాత్ర.ఇటీవల గుంటూరు.

ఎన్టీఆర్ జిల్లాలకి చేరుకోవడం జరిగింది.ఈ క్రమంలో విజయవాడ( Vijayawada )లో ప్రజలకు అభివాదం చేస్తుండగా సీఎం జగన్ ఎడమ కంటి పై రాయితో దాడి జరగడం సంచలనంగా మారింది.

పుట్టినరోజు వేల గొప్ప మనసు చాటుకున్న సితార.. తండ్రికి తగ్గ తనయ?