బీహార్ సీఎం కాన్వాయ్‌పై రాళ్ల దాడి.. 13 మంది అరెస్ట్
TeluguStop.com
బీహార్ సీఎం నితీష్ కుమార్ కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగింది.నేడు గయాలో సీఎం పర్యటన ఉంది.
ఈ క్రమంలో ఆయన స్థానికంగా తిరగడం కోసం కాన్వాయ్‌లోని కార్లు గయాకు బయలుదేరాయి.
మరోవైపు సీఎం పర్యటన నేపథ్యంలో కొందరు యువకులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గయా హైవేపై ధర్నాకు దిగారు.
అదే సమయంలో సీఎం కాన్వాయ్ అటువైపుగా రావడంతో కార్లపై రాళ్లు రువ్వారు.ఈ ఘటనలో నాలుగు కార్ల అద్దాలు ధ్వంసం అయ్యాయి.
అయితే ఈ ప్రమాదం జరిగినపుడు కార్లలో ఎవరూ లేరని అధికారులు తెలిపారు.దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు 13 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ఆ సినిమాలో డ్యూయల్ రోల్ లో చిరంజీవి.. బాక్సాఫీస్ షేక్ కావడం పక్కా!