టైటానిక్ నౌకలో మునిగిపోయిన ఓ జంటకు, మిస్సైన స్టాక్టన్ రష్‌కు వున్న సంబంధం ఇదే!
TeluguStop.com
ఇపుడు ఎక్కడ విన్నా మినీ జలాంతర్గామి 'టైటాన్'( Titan Sub ) గురించే చర్చ నడుస్తోంది.
విషయం ఏమిటంటే, అట్లాంటిక్ మహా సముద్రంలో 12 వేల అడుగుల లోతులోని టైటానిక్ నౌక శకలాలను( Titanic Ship ) చూసేందుకు ఐదుగురు పర్యాటకులతో ఆదివారం న్యూఫౌండ్‌ల్యాండ్ నుంచి బయలుదేరిన మినీ జలాంతర్గామి 'టైటాన్' గల్లంతైన సంగతి అందరికీ తెలిసినదే.
అయితే దాని ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు.ఈ టైటాన్‌లో ఉన్న ఓషన్ గేట్ వ్యవస్థాపకుడు స్టాక్టన్ రష్‌కు.
( Stockton Rush ) 111 ఏళ్ల క్రితం టైటానిక్ నౌకలో మునిగిపోయిన ఓ జంటకు సంబంధం ఉందని సమాచారం.
రష్ సతీమణి వెండీ రష్.( Wendy Rush ) ఆ జంట వారసురాలు అని భోగట్టా.
"""/" /
టైటానిక్ నౌకలో ప్రయాణించిన వారి వివరాలను పరిశీలించిన ఓ వార్త సంస్థ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించడం గమనార్హం.
ఆ జంట పేరు ఇసిడార్ స్ట్రాస్, ఇడా స్ట్రాస్.టైటానిక్ మొదటి సముద్రయానంలో.
ఈ సంపన్న జంట పాల్గొంది.ఈ నౌక 1912 ఏప్రిల్ 14న అట్లాంటిక్ మహాముద్రంలో( Atlantic Ocean ) ఓ మంచుకొండను ఢీ కొట్టి మునిపోయిన సంగతి అందరికీ తెలిసినదే.
అయితే ఈ ఘటనలో 1500 మంది జలసమాధి కాబడ్డారు.ఆ నౌక మునిగిపోయే సమయంలో ఇడాస్ట్రాస్‌కు ఆ ప్రమాదం నుంచి బయటపడే అవకాశం లభించింది.
కానీ కొందరు మహిళలు, చిన్నారులను లైఫ్‌బోట్ సహాయంతో రక్షిస్తుండగా.ఆమెను కూడా నౌక నుంచి తీసుకురావాలని చూసినా కుదరలేదు.
"""/" /
తన భర్త వెంట రాకుండా తాను రాలేనని అక్కడే ఉండిపోవడంతో భర్తతో పాటు ఆమె ప్రాణాలు కోల్పోయారు.
టైటానిక్ విషాదంలో వారిద్దరు కూడా ప్రేమకు గుర్తుగా నిలిచి పోయారు.ఈ జంట వారసురాలే వెండీ రష్.
స్ట్రాస్ దంపతుల కుమార్తెల్లో ఒకరైన మిన్నీకి మునిమనుమరాలు.ఆమె 1986లో స్టాక్టన్ రష్‌ను వివాహం చేసుకున్నారు.
ఆమె గత రెండు సంవత్సరాలలో టైటానిక్ శిథిలాలను వీక్షించడానికి వెళ్లిన 3 ఓషన్ గేట్ యాత్రల్లో పాల్గొన్నారు.
ఓషన్ గేట్ ఈ మినీ జలంతర్గామిని నిర్వహిస్తోంది.ప్రస్తుతం ఆ సంస్థకు ఆమె కమ్యూనికేషన్ డైరెక్టర్‌గా ఉన్నారు.
ఆ సంస్థ ఛారిటబుల్ ఫౌండేషన్ బోర్డు సభ్యురాలిగా కూడా ఆమె కొనసాగుతున్నారు.
ఆ స్టార్ హీరోలకు దిమ్మతిరిగే షాకిచ్చిన పవన్ కళ్యాణ్.. డేట్ విషయంలో మార్పు లేనట్టేనా?