భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
TeluguStop.com
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి.ఉదయం నుంచే లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు సాయంత్రం వరకు అదే రీతిలో కొనసాగాయి.
బ్రిటన్ గత వారం ప్రకటించిన పన్ను తగ్గింపు ప్రణాళికను వెనక్కి తీసుకోవడం మార్కెట్లపై సానుకూల ప్రభావాన్ని చూపింది.
ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపారు.ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,276 పాయింట్లు పెరిగి 58,065కి ఎగబాకింది.
నిఫ్టీ 387 పాయింట్లు పుంజుకుని 17,274 వద్ద ముగిసింది.అదేవిధంగా బ్యాంకు నిఫ్టీ 1,080 పాయింట్లు పెరిగింది.
Tipsport Zahlungen Und Kontozugang Für Spieler In DE