తెలంగాణ బీజేపీ లో ఇంకా అదే నిరుత్సాహం ! 

తెలంగాణలో ఈసారి ఎలా అయినా అధికారంలోకి రావాలనే పట్టుదల బిజెపిలో కనిపిస్తున్నా,  అందుకు తగ్గట్లుగా మాత్రం ఎన్నికల ప్రచారం సాగడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఢిల్లీ నుంచి బిజెపి అగ్ర నేతలు తెలంగాణ క్యూ కడుతున్నా,  తెలంగాణ బిజెపి నేతలు మాత్రం క్షేత్రస్థాయిలో పార్టీ ని బలోపేతం చేసే విధంగానూ, పార్టీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించే విషయంలోనూ తెలంగాణ బీజేపీ కీలక నాయకులు నిర్లక్ష్యంగా ఉంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

బీఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుండగా , బిజెపిలో మాత్రం ఆ ఉత్సాహం కనిపించడం లేదు.

బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కీలక నాయకులంతా క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.

"""/" /  బీఆర్ఎస్ తరపున ఆ పార్టీ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్, కేటీఆర్,  హరీష్ రావు,  కవిత వంటి వారు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు .

ఇక తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తో పాటు మరికొంతమంది నేతలు రోజుకు నాలుగైదు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ,  తమ పార్టీల మేనిఫెస్టోలను ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.

  కానీ బిజెపిలో ఈ పరిస్థితి కనిపించడం లేదు.తెలంగాణ బిజెపి అధ్యక్షుడుగా ఉన్న కిషన్ రెడ్డి( Kishan Reddy ) హైదరాబాదులో ఎన్నికల ప్రచారానికి పరిమితం అవుతున్నారు.

ఢిల్లీ నుంచి బిజెపి పెద్దలు వచ్చిన సమయంలోనే కాస్త హడావుడి చేస్తున్నట్టు కనిపిస్తున్నా, ఆ తరువాత సైలెంట్ అయిపోతున్నారు.

"""/" /  బీ ఆర్ ఎస్,  కాంగ్రెస్ లపై దూకుడుగా విమర్శలు చేసే విషయంలోనూ అంత ఉత్సాహం చూపించడం లేదు.

తెలంగాణ లో ఎన్నికల ప్రచారానికి ఈనెల 28 తో గడువు ముగియనున్నా,,  పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారాన్ని నిర్వహించేందుకు బిజెపి రాష్ట్రస్థాయి కీలక నేతలు ఎవరు అంతగా ఆసక్తి చూపించడం లేదు.

ఇక జనసేన పార్టీతో బిజెపికి పొత్తు ఉన్నా, ఆ ప్రభావం కూడా అంతంత మాత్రమే అన్నట్టుగా కనిపిస్తోంది.

ప్రస్తుతం ఈ టాలీవుడ్ హీరోల పిల్లలు సినిమాల కోసం మేకోవర్ అవుతున్నారు