న్యూజెర్సీ అసెంబ్లీకి ఎన్నికైన మూడో ఇండో అమెరికన్‌గా రికార్డు.. ఎవరీ స్టెర్లీ స్టాన్లీ ..?
TeluguStop.com
అమెరికా రాజకీయాలలో భారతీయులు దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే.మేయర్లు, సిటీ కౌన్సిల్ సభ్యులుగా, సెనేటర్లుగా, కాంగ్రెస్ సభ్యులుగా రాణిస్తున్నారు.
ఇక దేశంలోనే రెండో అత్యున్నత పదవిని భారత సంతతికి చెందిన కమలా హారిస్ అందుకున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఇండో అమెరికన్ స్టెర్లీ స్టాన్లీ (డెమొక్రాట్- మిడిల్ సెక్స్) న్యూజెర్సీ రాష్ట్ర శాసనసభకు ఎన్నికైన మూడవ భారత సంతతి వ్యక్తిగా రికార్డుల్లోకెక్కారు.
ఈ ఏడాది ప్రారంభంలో స్టాన్లీ .18వ జిల్లా శాసనసభ సీటును దక్కించుకుని న్యూజెర్సీ అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
ఇతని కంటే ముందు స్టేట్ సెనేటర్ విన్ గోపాల్ (డి-మోన్‌మౌత్), అసెంబ్లీ మేన్ రాజ్ ముఖర్జీ (డి- హడ్సన్) వున్నారు.
నాన్సీ పింకిన్ రాజీనామాతో ఖాళీ ఏర్పడటంతో స్టాన్లీ ఎన్నికల బరిలో నిలిచారు.ఈ క్రమంలో మిడిల్‌సెక్స్ కౌంటీ డెమొక్రాటిక్ ఆర్గనైజేషన్ ఆమోదం లభించడంతో తోటి డెమొక్రాట్, ఎడిసన్ కౌన్సిల్‌మన్ జో కోయిల్‌ను స్టాన్లీ ఓడించారు.
27, 2021న ఆయన న్యూజెర్సీ అసెంబ్లీ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.ప్రస్తుతం ఆయన లా, పబ్లిక్ సేఫ్టీ, ఆరోగ్యంపై అసెంబ్లీ కమిటీ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు.
కర్ణాటకలో పుట్టిన స్టెర్లీ స్టాన్లీ.చిన్న వయసులోని న్యూయార్క్‌లోని బ్రూక్లీన్‌కు వలస వచ్చారు.
గత 21 ఏళ్లుగా ఈస్ట్ బ్రన్స్‌విక్‌లో నివసిస్తున్నారు.లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా, తనఖా బ్రోకర్‌గా ఫైనాన్స్ రంగంలో కొన్నేళ్ల పాటు పనిచేశారు.
అలాగే మిడిల్‌సెక్స్ కౌంటీ కమ్యూనిటీ కార్యక్రమాల్లో స్టాన్లీ చాలా చురుగ్గా వుండేవారు.
గతంలో ఈస్ట్ బ్రన్స్‌విక్‌లోని లైట్‌హౌస్ క్రిస్టియన్ ఫెలోషిప్ చర్చి ట్రస్టీగా, ఫాక్స్ మెడో కండోమినియం అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు.
54 స్టాన్లీ ఈస్ట్ బ్రన్స్‌విక్ కౌన్సిల్ స్థానానికి 2020 లో రిపబ్లికన్ సుజానే బ్లమ్‌పై 5,137 ఓట్లతో తిరిగి ఎన్నికయ్యారు.
2019, 2020లో కౌన్సిల్ ప్రెసిడెంట్‌గానూ పనిచేశారు.ఈ ఏడాది జూన్‌లో డెమొక్రాటిక్ ప్రైమరీని గెలుచుకున్న స్టాన్లీ ఇప్పుడు రెండేళ్ల కాలానికి గాను నవంబర్‌లో జరిగే సాధారణ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.
న్యూజెర్సీలోని మిగిలిన శాసనసభ జిల్లాలకన్నా 18వ జిల్లాలో పెద్ద సంఖ్యలో ఆసియా అమెరికన్లు స్థిరపడ్డారు.
కాగా, న్యూజెర్సీలో ఆసియా జనాభా గడిచిన దశాబ్ధకాలంలో గణనీయమైన వృద్ధిని సాధించింది.ఇటీవల విడుదల చేసిన యూఎస్ సెన్సస్ డేటా ప్రకారం.
న్యూజెర్సీ రాష్ట్ర జనాభాలో 11 శాతం కంటే ఎక్కువ మంది ఆసియన్ సంతతి వారు వున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
పుష్ప 2 లో శ్రీ వల్లి ని చంపేది ఎవరో తెలుసా..?