రేషన్ కార్డులో మీ కుటుంబ సభ్యులను కూడా ఇలా యాడ్ చేయొచ్చు!
TeluguStop.com
ఈ రోజుల్లో రేషన్ కార్డు చాలా ముఖ్యం.ఆధార్ కార్డు మాదిరి ఇది కూడా కేవలం వ్యక్తికే కాదు అతని కుటుంబ సభ్యులకు కూడా చాలా భరోసాను ఇస్తోంది.
రేషన్ ద్వారా బీపీఎల్ కుటుంబాలకు నెలవారీ రేషన్‌ను అందిస్తోంది ప్రభుత్వం.అయితే, ఈ రేషన్ కార్డు ఉన్న వారికి వారి వివాహానంతరం లేదా పిల్లలు పుట్టాకా వారి వివరాలు కూడా నమోదు చేయాల్సి ఉంటుంది.
రేషన్ కార్డులో కుటుంబ పెద్దతోపాటు ఇతర సభ్యుల వివరాలు ఉంటాయి.కుటుంబ సభ్యుల వివరాలను కూడా రేషన్ కార్డులో ఎలా ఎంటర్ చేయాలో ఆ వివరాలు తెలుసుకుందాం.
సాధారణంగా కుటుంబ సభ్యుల వివరాలను రేషన్ కార్డులో నమోదు చేయించడానికి మీ ఇంటికి దగ్గరలో ఉన్న ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అయితే, ఇప్పుడు ఆ అవసరం లేదు, ఇంటి నుంచే సులభంగా యాడ్ చేసుకునే వెసులుబాటు ఉంది.
H3 Class=subheader-styleకావాల్సిన డాక్యుమెంట్స్./h3p """/"/
కుటుంబ సభ్యుల వివరాలు రేషన్ కార్డులో నమోదు చేయడానికి వారి ఫోటో, పుట్టిన ధ్రువపత్రం, పిల్లల కోసమైతేతల్లిదండ్రుల ఆధార్ కార్డు అవసరం.
ఒకవేళ పెళ్లి తర్వాత వ్యక్తి పేరును నమోదు చేయాలనుకుంటే, ఆడవారి పేరును ఫ్యామిలీ హెడ్ కింద యాడ్ చేయాల్సి ఉంటుంది.
సదరు వ్యక్తి ఆధార్ కార్డు, మ్యారేజ్ సర్టిఫికేట్, అలాగే వారి తల్లిదండ్రుల రేషన్ కార్డు వివరాలను కూడా నమోదు చేయాల్సి ఉంటుంది.
H3 Class=subheader-styleఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే విధానం/h3p """/"/
– దీనికి మీ రాష్ట్రానికి సంబంధించిన ఫుడ్ సప్లై అధికారిక వెబ్‌సైట్లో దరఖాస్తు చేసుకోవాలి.
అంటే ఒక వేళ మీరు తెలంగాణకు చెందిన వారైతే.https://fsc.
Ts.gov!--in/foodportal.
Aspx లో దరఖాస్తు చే సుకోవాల్సి ఉంటుంది.–
– మీరు మొదటిసారి ఈ సైట్‌ను ఉపయోగిస్తున్నట్లైతే ఐడీ క్రియేట్ చేయాల్సి ఉంటుంది.
లేకపోతే నేరుగా లాగిన్ అయిపోతే సరిపోతుంది.–లాగిన్ అయిన తర్వాత హోంపేజీలో ‘యాడింగ్ ఎ మెంబర్’ ఆప్షన్ కనిపిస్తుంది.
– దానిపై క్లిక్ చేస్తే, కొత్త ఫారం ఓపెన్ అవుతుంది.అది పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఆ తర్వాత అన్ని ఇతర డాక్యుమెంట్ల కాపీలను అప్‌లోడ్ చేయాలి.– సబ్‌మిట్ చేసిన తర్వాత, మీకు ఓ రిజిస్ట్రేషన్ నంబర్ వస్తుంది.
దీంతో రేషన్ కార్డు స్టేటస్‌ను ట్రాక్ చేయవచ్చు.దీన్ని సంబంధిత అధికారులు చెక్ చేస్తారు.
మీరు నమోదు చేసిన వివరాల్లో ఏ లోపం లేకపోతే, యాక్సెప్ట్ చేస్తారు.అప్పుడు మీ కుటుంబ సభ్యుల వివరాలను జత చేసి, మీ ఇంటికే రేషన్ కార్డు డెలివరీ అయిపోతుంది.