సూర్యాపేట జిల్లా:మోడల్,ప్రభుత్వ కెజిబివి పాఠశాలలో పాఠ్యపుస్తకాలు,యూనిఫామ్స్ పంపిణీ చేయాలని పి.డి.
ఎస్.యు.
సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు పోలేబొయిన కిరణ్ డిమాండ్ చేశారు.రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ,మోడల్,కెజిబివి పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు తక్షణమే పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్,టై,బెల్టు,షూలు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ తిరుమలగిరి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ ముందు పీ.
డి.ఎస్.
యు ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో
ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా కిరణ్, పి.
డి.ఎస్.
యు డివిజన్ కార్యదర్శి జక్కుల సుధాకర్ మాట్లాడుతూ విద్యా సంస్థలు ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా,మోడల్ స్కూల్,కెజిబిఎస్ ప్రభుత్వ పాఠశాలాల్లో విద్యార్థులకు
పాఠ్యపుస్తకాలు,యూనిఫామ్స్ పంపిణీ చేయకపోవడం అంటే గ్రామీణ ప్రాంతాల్లోని పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులను చదువుకు దూరం చేయడమేనని విమర్శించారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తూ కనీసవసతులు కల్పించకుండా ప్రభుత్వ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తోందని మండిపడ్డారు.
మనఊరు-మనబడి పేరుతో 7వేల కోట్లకు పైగా విడుదల చేసి ప్రభుత్వ పాఠశాలలను కార్బోరేటుకు ధీటుగా తయారు చేస్తామని చెప్పిన కేసీఆర్,పూర్తిస్థాయిలో నిధులు విడుదల చేయలేదని, కేసీఆర్ మాటలు కోటలు దాటుతున్నా చేతలు మాత్రం గడపలు దాటడం లేదని ఎద్దేవా చేశారు.
ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతం చేసి పూర్తిస్థాయిలో టీచర్ పోస్టులను భర్తీ చేయాలని విద్యార్థి సంఘాలు అనేక ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నా ప్రభుత్వం నిమ్మకు నేరెత్తినట్టుగా వ్యవరిస్తోందని ధ్వజమెత్తారు.
కనీసం పాఠశాలల్లో మూత్రశాలలు,మరుగుదొడ్లు,ప్రహరీగోడలు,తరగతి గదులు,ఫ్యాన్లు,లైట్లు,మంచినీటి వంటి సౌకర్యాలు లేకుండా వేలాది పాఠశాల ఉన్నాయన్నారు.
చివరికి 2500 రూపాయలకి ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న స్కావెంజర్లని కూడా ప్రభుత్వం తొలగించిందని,దాని ఫలితంగా ప్రభుత్వ పాఠశాలలు పశువుల కొట్టం కంటే దారుణంగా తయారవుతున్నాయని అన్నారు.
తక్షణమే మోడల్ స్కూల్,కెజిబిఎస్ పాఠశాలలో పాఠ్యపుస్తకాలు,యూనిపామ్,పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పి.
డి.ఎస్.
యు నాయకులు ప్రవీణ్,దినేష్,యశ్వంత్,సందీప్,అక్షిత, నందిని,మేఘన,భవాని,శ్రావణి,సింధు,ప్రత్యూష,ఉష తదితరులు పాల్గొన్నారు.
మెగాస్టార్ బాబీ కాంబో సినిమాకు నిర్మాత ఎవరు.. చిరంజీవి అలా చేయడం సాధ్యమేనా?