కొత్త సంకల్పంతో కొత్త భవనంలోకి అడుగు..: ప్రధాని మోదీ

కొత్త సంకల్పంతో కొత్త పార్లమెంట్ భవనంలోకి ప్రవేశిస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

పాత పార్లమెంట్ భవనంలో చివరి సరిగా మోదీ ప్రసంగిస్తూ ఎన్నో చారిత్రక ఘట్టాలకు ఈ భవనం సాక్ష్యంగా నిలిచిందని తెలిపారు.

86సార్లు రాష్ట్రపతులు ఇక్కడి నుంచి ప్రసంగించారని మోదీ పేర్కొన్నారు.లోక్ సభ, రాజ్యసభ కలిసి సుమారు నాలుగు వేల చట్టాలు చేశాయన్నారు.

ఇక్కడే మన రాజ్యాంగం రూపుదిద్దుకోగా జాతీయగీతం, జాతీయ పతాకం ఎంచుకున్నామని తెలిపారు.భారత్ ఐదో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఎదిగిందన్నారు.

త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తామని వెల్లడించారు.

ఫుట్‌పాత్‌పై మహీంద్రా థార్‌తో దూసుకెళ్లిన బాలుడు.. వీడియో చూస్తే..