బీజేపీ బీఆర్ఎస్ మధ్య ‘ స్టీల్ ‘ యుద్ధం
TeluguStop.com
ఏపీలో పాగా వేసేందుకు తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్( BRS ) అనువైన సమయం కోసం ఎప్పటి నుంచో ఎదురుచూపులు చూస్తోంది.
తెలంగాణ తర్వాత ఏపీలో బీఆర్ఎస్ బలోపేతానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఆ పార్టీ అధిష్టానం బలంగా నమ్ముతోంది.
అందుకే ఏపీ ఫై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఏపీలో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ఒకపక్క ఏర్పాట్లు చేస్తూ .
పార్టీని బలోపేతం చేసే ప్రయత్నాలు చేస్తుండగానే అనూహ్యంగా స్టీల్ ప్లాంట్ ఉద్యమం బీఆర్ఎస్ కు కలిసి వచ్చింది.
ఎట్టి పరిస్థితుల్లోనైనా, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటామంటూ బీఆర్ఎస్ ప్రకటనలు చేసింది.
అంతేకాదు ఒకవేళ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కు సంబంధించి కేంద్రం వెనక్కి తగ్గకపోతే , కొనుగోలుకు సంబంధించి బిడ్ లోను తాము పాల్గొంటామంటూ ప్రకటనలు చేశారు .
"""/" /
ఆ ప్రకటన తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్( Visakha Steel Plant ) ను ప్రైవేటీకరణ చేసే ఉద్దేశం లేదని కేంద్రం తేల్చి చెప్పడంతో, ఆ క్రెడిట్ మొత్తం బిఆర్ఎస్ తమ ఖాతాలో వేసుకుంది.
తమ వల్లే కేంద్రం వెనక్కి తగ్గిందని బీఆర్ఎస్ ప్రకటనలు చేసింది.ఇదే స్టీల్ ప్లాంట్ విషయమై బిజెపి బీ ఆర్ ఎస్ మధ్య పొలిటికల్ వార్ ఏపీలో పెరిగింది.
ఇటీవల బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్( Chandrasekhar ) విశాఖ వెళ్లి స్టీల్ ప్లాంట్ కార్మికులను కలిసి సంఘీభావం తెలిపారు .
ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ కు వెళ్ళే రోడ్ లో భారీగా బీఆర్ఎస్ ఫ్లెక్సీలను , జెండాలను కట్టారు.
అయితే బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విశాఖ స్టీల్ ప్లాంట్ ను సందర్శించబోతుండడంతో, ఏపీ బీజేపీ నాయకులు బీఆర్ఎస్ జెండాలను తొలగించడం వివాదంగా మారింది.
"""/" /
దీనిపై బీఆర్ఎస్ నేతలు జివిఎల్ నరసింహారావు తో పాటు, కొంతమంది బిజెపి నాయకులు పైన దువ్వాడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
జివిఎల్ ప్రోత్సాహంతోనే బీఆర్ఎస్ జెండాలను బిజెపి శ్రేణులు తొలగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.ప్రస్తుతం ఈ వ్యవహారం పైనే బీఆర్ఎస్, బిజెపి ల మధ్య విశాఖలో రాజకీయ యుద్ధం జరుగుతోంది.