లంచంపై ఉక్కుపాదం.. ఏపీ సీఎం సరికొత్త నిర్ణయం
TeluguStop.com
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు.లంచంపై ఉక్కుపాదం మోపడానికి సరికొత్త నిర్ణయాన్ని వెల్లడించారు.
లంచం తీసుకుని రెడ్ హ్యాండెడ్ గా దొరికే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించారు.
అధికారులు అవినీతికి పాల్పడకుండా చట్టాన్ని తీసుకురావడానికి ఆలోచిస్తున్నారు.సోమవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
అవినీతి నిరోధం, ప్రభుత్వ చర్యలపై మాట్లాడారు.సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, ఏసీబీ ఎస్ఆర్.
ఆంజనేయులు, వివిధ శాఖల ఉన్నతాధికారులులతో కలిసి సమావేశం జరిపారు.ఇకపై రాష్ట్రంలో లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికితే తక్షణమే శిక్షించేలా చట్టం తీసుకురావాలని అన్నారు.
దిశ వంటి చట్టం తరహాలో లంచం తీసుకునే వారిని శిక్షించేందుకు అసెంబ్లీలో బిల్లు పెట్టాలని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా వస్తున్న ఫిర్యాదులను అనుసంధానం చేసి అవినీతి నిరోధించేందుకు ప్రయత్నం చేయాలన్నారు.ఇప్పటి నుంచి ప్రభుత్వంలోని అన్ని విభాగాల్లోనూ రివర్స్ టెండరింగ్ అమలు చేయాలన్నారు.
ఈ రివర్స్ టెండర్ విధానంతో టెండర్ విలువ రూ.కోటి దాటితే రివర్స్ టెండరింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు.
దీంతో పాటుగా కర్నూల్ జిల్లా పిన్నాపురం విద్యుత్ ప్రాజెక్ట్, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
ఈ ప్రోటీన్ మాస్క్ తో మీ కురులు అవుతాయి డబుల్..!