ఇలా ఆవిరి ప‌డితే ముఖంపై మొటిమ‌లు మాయం!

మొటిమ‌లు.కేవ‌లం యువ‌తీ, యువ‌కుల‌నే కాదు అన్ని వ‌య‌సుల వారిని ఈ స‌మ‌స్య ఇబ్బంది పెడుతోంది.

మొటిమ‌లు రావ‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి.ఒత్త‌గా, హ‌ర్మోన్ల లోపం, కొన్ని మందుల వాడ‌కం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల మొటిమ‌లు వ‌స్తుంటాయి.

ఇక ఈ మొటిమ‌ల‌ను త‌గ్గించుకునేందుకు నానా ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.ఏవేవో క్రీములు పూస్తుంటారు.

అయిన‌ప్ప‌టికీ త‌గ్గ‌క‌పోతే.తెగ బాధ ప‌డుతుంటారు.

అయితే ఇప్పుడు చెప్ప‌బోయే విధంగా ఆవిరి ప‌డితే.మొటిమ‌ల స‌మ‌స్య‌ను సువులువుగా నివారించుకోవ‌చ్చు.

మ‌రి అదెలాగో ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.ఆవిరి ప‌ట్ట‌డం ఆరోగ్యానికి కాదు.

చ‌ర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.ముఖ్యంగా మొటిమ‌లు ఉన్న వారు ఒక గిన్నెలో నీటిని తీసుకుని అందులో తులసి ఆకులు మ‌రియు ప‌సుపు వేసి బాగా మ‌రిగించాలి.

అనంత‌రం ఆ నీటితో ఒక ఐదు నిమిషాల పాటు ఆవిరి ప‌ట్టాలి.ఇలా ప్ర‌తి రోజు చేయ‌డం వ‌ల్ల మొటిమ‌లు మ‌రియు వాటి వ‌చ్చే మ‌చ్చ‌లు కూడా క్ర‌మంగా త‌గ్గిపోతాయి.

"""/"/ అలాగే ఇలా ఆవిరి ప‌ట్ట‌డం వ‌ల్ల మొటిమ‌లే కాదు.మ‌రిన్ని సౌంద‌ర్య ప్ర‌యోజ‌నాలు కూడా ఉన్నాయి.

ప్ర‌తి రోజు ఆవిరి ప‌ట్ట‌డం వ‌ల్ల మూసుకుపోయిన రంధ్రాలు తెరచుకొని మురికి బయటకు వచ్చేస్తుంది.

ఫ‌లితంగా ముఖం కాంతివంతంగా, ఫ్రెష్‌గా మారుతుంది.ఇక‌ సాధార‌ణంగా చాలా మంది కంటి కింద నల్లటి వలయాల‌తో ఇబ్బంది ప‌డుతున్నారు.

ఎన్ని విధాలుగా ప్ర‌య‌త్నించినా.కంటి కింద ఉన్న వ‌ల‌యాలు మాత్రం అస్స‌లు పోవు.

అయితే పైన చెప్పిన విధంగా ఆవిరి ప‌ట్ట‌డం ద్వారా సులువుగా న‌ల్ల‌టి వ‌ల‌యాల‌ను దూరం చేసుకోవ‌చ్చు.

అలాగే ముఖంపై మృత క‌ణాలు ఉంటే.చ‌ర్మం అంద‌హీనంగా క‌న‌ప‌డుతుంది.

కానీ, రెగ్యుల‌ర్‌గా ఆవిరి ప‌డితే.మృత క‌ణాల‌ను తొలిగించి ముఖాన్ని అందంగా మారుస్తుంది.

ఇక పొడి చ‌ర్మంతో ఇబ్బంది ప‌డుతున్న వారు ప్ర‌తి రోజు ఆవిరి ప‌డితే.

స్కిన్ మృదువుగా మ‌రియు య‌వ్వ‌నంగా మారుతుంది.

మేడం టుస్సాడ్స్ లో చరణ్ మైనపు విగ్రహం.. సంతోషంలో మెగా ఫ్యాన్స్?