గిల్లి గిల్లించుకోడం అంటే ఇదేనేమో మోదీ జీ ? 

అసలు రాష్ట్రాల వ్యవహారాలపై ఏవిధమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసేందుకు ఇష్టపడరు ప్రధాని నరేంద్ర మోదీ.

అలా చేస్తే తిరిగి తనకే గట్టి కౌంటర్లు పడతాయని,  అనవసర వివాదాలు వస్తాయని ఆయనకు బాగా తెలుసు.

నిన్న జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాలను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ముఖ్యంగా దేశ వ్యాప్తంగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల వ్యవహారంలో కేంద్రం పై దేశ వ్యాప్తంగా నిరసన వ్యక్తం అవుతోంది.

వీటి ధరలను అదుపు చేయడంలో కేంద్రం విఫలమైందని బీజేపీ వ్యతిరేక పార్టీలు విమర్శలు చేస్తున్నాయి.

ప్రజల్లోనూ కేంద్రంపై ఇదే రకమైన అభిప్రాయం వ్యక్తమవుతోంది.ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోదీ పెట్రోల్ , డీజిల్ ధరల పెరుగుదల అంశంపై రాష్ట్రలదే బాధ్యత అంటూ వ్యాఖ్యానించారు.

రాష్ట్రాల్లో వ్యాట్ టాక్స్ ఎక్కువగా విధించడం వల్లే వీటి ధరలు పెరిగాయని ప్రధాని ప్రకటించారు.

కేంద్రం ఇంధన ధరలపై గత నవంబర్ లో ఎక్సైజ్ సుంకాలు తగ్గించినప్పటికీ కొన్ని రాష్ట్రాలు ఈ పన్నుల పై వెనక్కి తగ్గలేదని , ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సమైక్య స్ఫూర్తి పెంపొందించాల్సిన అవసరం ఉందని ప్రధాని వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగానే ఆయన ముఖ్యమంత్రుల సమావేశంలో చర్చించారు.భారత్ లో పెట్రోల్ డీజిల్ ధరల భారం తగ్గించేందుకు కేంద్రం గత నవంబర్ లో ఎక్సైజ్ సుంకం తగ్గించింది .

  """/"/ ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు పనులను తగ్గించగా,  మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ,కేరళ ,జార్ఖండ్ రాష్ట్రాలు రకరకాల కారణాలతో పనులను తగ్గించలేదు.

దీనిని  ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించారు.దీనిపై ఆయా రాష్ట్రాలు గట్టిగానే కౌంటర్ ఇచ్చాయి.

కేంద్రం పెంచిన ఎక్సైజ్ ధరల కారణంగానే ఈ పెరుగుదల చోటు చేసుకుందని కాంగ్రెస్  విమర్శించింది.

ఇక ఈ విషయంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కూడా స్పందించారు.రాష్ట్రానికి కేంద్రం 26,500 కోట్ల బాకీ ఉందని ఆరోపించారు.

పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదల పై రాష్ట్రాలు బాధ్యత వహించవని ఉద్ధవ్ ప్రధానికి కౌంటర్ ఇచ్చారు.

తెలంగాణా, ఆంధ్ర , బీజేపీ పాలిత రాష్ట్రాల మినహా మిగతా అన్ని రాష్ట్రాలు ప్రధానిపై ఘాటు వ్యాఖ్యలే చేశాయి.

మరింత భారం కానున్న రీఛార్జిలు.. నిన్న జియో, నేడు ఎయిర్టెల్.. ఇకబాదుడే..