ఉపాధి హామీ పనులను పరిశీలించిన రాష్ట్ర విజిలెన్స్ అధికారి ఉష

నల్లగొండ జిల్లా: మర్రిగూడ మండలం యరగండ్లపల్లి, కొండూరు గ్రామాలలో జరుగుతున్న గ్రామీణ ఉపాధి హామీ పనులను గురువారం రాష్ట్ర విజిలెన్స్ ఆఫీసర్ ఉష పరిశీలించారు.

ఉపాధి కూలీలతో పనిదినాలు, వేతనాలు,సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.కూలీలకు సరైన సౌకర్యాలతో పాటు కనీస వేతనాలు అందేలా చూడాలని అధికారులకు సూచించారు.

నర్సరీ,పల్లె ప్రకృతి వనాల పనులపై అధికారులకు పలు సూచనలు చేశారు.హార్టికల్చర్లో పండ్ల తోటల పెంపకానికి స్థలాలను గుర్తించాలన్నారు.

ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ ఆఫీసర్ శరత్ కుమార్, క్లస్టర్ ఇంచార్జ్ బాలకృష్ణ, ఎంపీడీవో చినమున్నయ్య, ఎంపీఓ రవికుమార్,ఏపీఓ వెంకటేశం,పంచాయతీ కార్యదర్శి మౌనిక తదితరులు పాల్గొన్నారు.

ఎంవీవీ బీజేపీ వైపు చూస్తున్నారా ? అందుకే పోటీ నుంచి తప్పుకున్నారా ?