టిడిపి కార్యాలయంపై దాడిని ఖండించిన రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు కామెంట్స్.మంగళగిరి , విశాఖపట్నం లోని టిడిపి కార్యాలయాలపై వైసిపి గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా.

ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా ? ప్రాశస్త్య దేశంలో ఉన్నామా అనే అనుమానం కలుగుతోంది.

ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించేవారిపై ఇలాంటి దాడులు సమంజసమా?.రాష్ట్రంలో అసలు శాంతి భద్రతలు ఉన్నాయా?.

టిడిపి కార్యాలయాలపై దాడికి పాల్పడిన వారిని ఉరితీయాలి.ఈ ఘటనకు ముఖ్యమంత్రి, డిజిపి బాధ్యత వహించాలి.

ముఖ్యమంత్రి, డిజిపి ప్రోద్బలంతో వైసిపి గూండాలు ఈ దాడికి పాల్పడ్డారు.తెలుగుదేశం కార్యకర్తలు ధైర్యంగా ఉండాలి.

రాష్ట్రంలో ప్రభుత్వం, శాంతి భద్రతలు ఎక్కడా లేవు.మన ప్రాణాలు, మన ఆస్తులు మనమే కాపాడుకోవాలి.

జరిగిన సంఘటనకు సిగ్గుతో జగన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి.డిజిపి వెంటనే ఈ దాడిని తీవ్రంగా పరిగణలోకి తీసుకోవాలి.

బాధ్యులపై కేసులు పెట్టడం కాదు నడిరోడ్డుపై ఉరితీయాలి.తెలుగుదేశం కార్యకర్తలు అనుకుంటే మీరు ఎక్కడైనా తిరగగలరా?.

దాడులు చేయడం మాకు చేతకాదా?.ప్రజాస్వామ్యాన్ని గౌరవించి మేము సైలెంట్ గా ఉంటున్నాం తప్ప చేతకాక కాదు.

జగన్ కి, వైసిపికి పోయేకాలం దగ్గరకు వచ్చింది.అందుకే ఇటువంటి దారుణాలు చేస్తున్నారు.

ఈ దాడిని ప్రతీ ఒక్కరూ ఖండించాలని కోరుతున్నా.

క్యాండీ క్రష్ గేమ్ కోసం రూ.30 లక్షల చర్చి నిధులు వాడేసిన పాస్టర్‌..??