ఘనంగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ రావు జన్మదిన వేడుకలు
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ జడ్పిటిసి కార్యాలయంలో శనివారం బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు వినోద్ రావు జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఏఎంసీ మాజీ అధ్యక్షులు అందే సుభాష్ ,బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి లు కలిసి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను జరిపారు.
ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు , కార్యకర్తలు కలిసి స్వీట్లు పంచుకున్నారు.
ఈ జన్మదిన వేడుకలలో గుండారం సర్పంచ్ భూక్యా శంకర్ నాయక్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు ఎడ్ల సందీప్ , ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు భూక్య సిత్యానాయక్ , ఏఎంసీ మాజీ చైర్మన్ గుల్లపల్లి నరసింహారెడ్డి , ఉపాధ్యక్షులు గోషిక దేవదాస్, బిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు కొలనూరి శంకర్ ,
ఆకుల మురళి మోహన్ గౌడ్ , సీనియర్ నాయకులు నమిలికొండ శ్రీనివాస్, మీసం రాజ్యం , ఎలగందుల నర్సింలు , గంట బాలా గౌడ్ , అజ్జు బాయ్, బందారపు బాల్రెడ్డి, పరుశరాములు యాదవ్, వరద బాబు, ఎలగందుల బాబు , బిఆర్ ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు అందే సురేష్, సిరికొండ నాగరాజు, సోషల్ మీడియా ప్రతినిధి వట్టెల ప్రభాకర్ యాదవ్ , గన్నమనేని సుధాకర్ రావు, యూత్ లీడర్లు చందనం శివరామకృష్ణ, గుర్రం భరత్ యాదవ్ బాబు , అందె కృష్ణ, తదితరులు పాల్గొన్నారు,.
పవిత్ర లోకేశ్ వచ్చిన తర్వాత నా లైఫ్ అలా ఉంది.. నరేష్ సంచలన వ్యాఖ్యలు వైరల్!