పేట మున్సిపాలిటీకి రాష్ట్రస్థాయి ప్రగతి పురస్కారం
TeluguStop.com
సూర్యాపేట జిల్లా:పట్టణ ప్రగతి పురష్కారాలలో భాగంగా శుక్రవారం హైద్రాబాద్ లో రాష్ట్రంలోని అన్ని
పురపాలక సంఘాల మేయర్లు,చైర్పర్సన్లు, కమీషనర్లతో నిర్వహించిన కార్యక్రమంలో ఒక లక్ష ఫైన జనాభా గల మున్సిపాల్టీలలో రెవిన్యూ ఇంప్రూమెంట్ (ఆదాయం పెంచుకోవడంలో) కృషి చేసిన సూర్యాపేట మున్సిపాల్టీకి పురష్కారం లభించింది.
తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు,ట్రాన్స్పోర్ట్ శాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేతుల మీదుగా పేట మున్సిపల్ ఛైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ, మున్సిపల్ కమీషనర్ పి.
రామానుజులరెడ్డి ప్రశంసా పత్రం మరియు షీల్డ్ స్వీకరించారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ సూర్యాపేట మున్సిపాల్టీ పర్యావరణ పరిరక్షణలో భాగంగా సూపర్ సింగల్ యూజ్ ప్లాస్టిక్ వేస్ట్ ఎఫక్ట్ వెల్లి రీ సైకిల్డ్ ద్వారా అక్యు ప్రెషర్ మ్యాట్,మ్యాట్,టైల్స్ తయారు చేయడాన్ని మరోసారి మెచ్చుకున్నారు.
ఈ కార్యక్రమంలో పురపాలక పరిపాలన శాఖా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్,పురపాలక పరిపాలన సంచాలకులు ఎన్.
సత్యనారాయణత దితరులు పాల్గొన్నారు.
నాన్న చేసిన అతి పెద్ద తప్పు అదే.. మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు!