రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది: ఎమ్మెల్యే బాలూ నాయక్

నల్లగొండ జిల్లా: చందంపేట మండల కేంద్రంలోని కస్తూరిభాయి పాఠశాలలో అదనపు గదుల నిర్మాణం మరియు సైన్స్ ప్రయోగశాలకు దేవరకొండ ఎమ్మెల్యే నేనవత్ బాలు నాయక్ మంగళవారం శంకుస్థాపన చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని,పేద విద్యార్థుల ఉన్నత విద్య కోసం పాఠశాలలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.

కస్తూరిభాయి పాఠశాలలో అదనపు గదుల నిర్మాణం మరియు సైన్స్ ప్రయోగశాల మరమ్మతుల కోసం పిఎం- ఎస్.

హెచ్.ఆర్.

ఐ.నిధుల నుండి రూ.

85 లక్షలు మంజూరు చేయడం జరిగిందన్నారు.విద్యార్థులు ఇష్ట పడి చదివి నియోజకవర్గానికి మంచి పేరు తేవాలని సూచించారు.

పెద్దలు పనికి పోయి,పిల్లలు బడికి పోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు,పీఏసీఎస్ చైర్మన్ జాలే నరసింహారెడ్డి, చందంపేట ఎంపీపీ పార్వతి నాయక్, పార్లమెంట్ కో ఆర్డినేటర్ సిరాజ్ ఖాన్,మాజీ దేవరకొండ సర్పంచ్ పున్న వెంకటేష్,మాజీ మార్కెట్ చైర్మన్ ముక్కమల్ల వెంకటయ్య గౌడ్,మండల ఎంపిటిసి మల్లయ్య,కో ఆప్షన్ నెంబర్ సాదిక్, డిఈఓ శైలజ,ఎంఈఓ సామ్యా నాయక్, కస్తూరిబాయి పాఠశాల హెచ్ఓ కుక్కల కవిత, యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేతావత్ రమేష్ నాయక్,వంశీ,బాబురాం నాయక్,వెంకటయ్య, శ్రీధర్,మాజీ ఎంపిటిసి మహాలక్ష్మయ్య,భరత్ నాయక్,విజయ్, రేకులగడ్డ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

ఒకరికి ఇవ్వాల్సిన అవార్డు మరొకరికి ఇచ్చారు..ఫ్యాన్స్ ఫుల్ యాంగ్రీ