ఐదేళ్ల పాలనలో రాష్ట్రం నాశనం.. జగన్ పై దేవినేని ఫైర్

ఏపీ సీఎం జగన్ పై( CM Jagan ) టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వర( Devineni Umamaheswara Rao ) రావు కీలక వ్యాఖ్యలు చేశారు.

వైసీపీ ఐదేళ్ల పాలనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని జగన్ నాశనం చేశారని దేవినేని ఆరోపించారు.

ఆస్తులు కూడబెట్టుకోవడానికి ఇష్టారాజ్యంగా అధికారాన్ని ఉపయోగించుకున్నారని విమర్శించారు.అంతేకాకుండా ప్రతిపక్ష నేతలపై పగ తీర్చుకునేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు.

ప్రజా సంక్షేమాన్ని( People Welfare ) ఏ మాత్రం పట్టించుకోలేదన్న ఆయన దోచుకోవడం, దాచుకోవడం కోసం అధికారం కావాలంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పాలన ఎలా ఉండకూడదో చెప్పేందుకు జగన్ పరిపాలనే( Jagan Ruling ) ఉదాహరణ అంటూ విమర్శించారు.

కొరటాల శివ ఆ స్టార్ హీరో తో సినిమా చేస్తున్నాడా..?