ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు మోగిన నగారా.. !

దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలకు షెడ్యూల్‌ ఖరారు అయింది.కాగా శుక్రవారం సాయంత్రం ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగించింది.

ఈ నేపధ్యంలో పశ్చిమ బెంగాల్‌, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, అసోం రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్‌ విడుదల చేసే అవకాశం ఉంది.

అంతే కాకుండా తెలంగాణలోని నాగార్జున సాగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ స్థానం ఉప ఎన్నికకు సైతం షెడ్యూల్‌ జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అలాగే ఏపీ లోని తిరుపతి పార్లమెంట్‌ స్థానానికి సైతం షెడ్యూల్‌ విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

అదీగాక ఐదు రాష్ట్రాలకు నిర్వహించే ఎన్నికలతో పాటు ఈ రెండు స్థానాలకు సైతం షెడ్యూల్ జారీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఇప్పటికే ఐదు రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటించింది.ఎన్నికల నిర్వహణపై అధికారులు, రాజకీయ పార్టీలతో ఈసీ చర్చించి ఈ నిర్ణయానికి వచ్చిందట.

ఆ సినిమాలో నన్ను తప్పించి మహేష్ కొడుకుకు ఛాన్స్ ఇచ్చారు.. నిఖిల్ దేవదుల ఏమన్నారంటే?