Aarthi Agarwal : కొడుకు సంతోషం కోసం ఒక మెట్టు దిగి.. ఆ హీరోయిన్ ని వేడుకున్న స్టార్ హీరో తండ్రి…రిజెక్ట్ చేసిన నటి?
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీ( Telugu Film Industry ) లో ఎంతోమంది సినీ సెలబ్రిటీలు మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
ఇలా ఇండస్ట్రీలోకి వచ్చి అతి తక్కువ సమయంలోనే స్టార్ సెలబ్రెటీ హోదా అందుకున్నటువంటి వారిలో నటి ఆర్తి అగర్వాల్ ( Aarthi Agarwal ) ఒకరు.
ఈమె నువ్వు నాకు నచ్చావ్, ప్రియమైన నీకు, ఇంద్ర వంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
ఇలా నటిగా ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో ఓ వెలుగు వెలిగినటువంటి ఆర్తి అగర్వాల్ కెరియర్ పరంగా తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల ఈమె కెరియర్ పూర్తిగా దెబ్బతింది.
"""/" /
ఈ విధంగా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా వెలిగినటువంటి ఈమె అనంతరం అవకాశాలు లేకపోవడంతో పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు.
కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు ఆర్తి అగర్వాల్ పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు అయితే ఈమె ఉన్నఫలంగా అధిక శరీర బరువు( Overweight ) కావడంతో బరువు తగ్గడానికి సర్జరీ చేయించుకున్నారు.
అయితే ఆ సర్జరీ వికటించి ఆర్తి అగర్వాల్ అతి చిన్న వయసులోనే మరణించారు.
ఈమె మరణించినప్పటికీ ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాలలో అలాగే ఉన్నారు అయితే ఆర్తి అగర్వాల్ మరణించిన తనకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.
ఆర్తి అగర్వాల్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలోనే ఈమె వద్దకు ఒక స్టార్ హీరో( Star Hero Father ) తండ్రి మంచి ప్రపోజల్ ద్వారా ఆమె ముందుకు వచ్చారట.
కొన్ని వందల కోట్ల ఆస్తులు ఉన్న స్టార్ సెలబ్రిటీ అనే హోదా ఉన్న ఆ ఈగోలన్నింటినీ పక్కన పెట్టి తన కుమారుడి సంతోషం కోసం ఆర్తి అగర్వాల్ వద్దకు వచ్చి తన కుమారుడు తనని ఇష్టపడుతున్నారని తనని పెళ్లి చేసుకోవాలి అంటూ ప్రపోజల్ తీసుకువచ్చారట ఇలా ఒక స్టార్ హీరో తండ్రి స్వయంగా ఆమె వద్దకు వచ్చి ఈ ప్రపోజల్ ఆఫర్ ఇచ్చినప్పటికీ ఆర్తి అగర్వాల్ మాత్రం ఆ ప్రపోజల్ రిజెక్ట్ చేశారని తెలుస్తుంది.
"""/" /
ఈ విధంగా ఈమె స్టార్ హీరోని రిజెక్ట్( Star Hero Love ) చేయడానికి కారణం లేకపోలేదు అప్పటికే ఈమె హీరో తరుణ్ ( Tarun ) తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు.
ఇలా తరుణ్ తో ప్రేమలో ఉన్నటువంటి ఈమె తనని పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతోనే ఆ స్టార్ హీరో ప్రపోజల్ రిజెక్ట్ చేశారని తెలుస్తుంది.
అయితే చివరికి తాను ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేయడానికి తన తల్లిదండ్రులు కూడా నిరాకరించి అనంతరం వారికి నచ్చిన వ్యక్తితోనే ఆర్తి అగర్వాల్ పెళ్లి చేశారు.
"""/" /
ఇలా తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నటువంటి ఈమె పెళ్లి విషయంలో ఎంతో బాధపడ్డారని తెలుస్తోంది అయితే తన శరీర బరువు కారణంగా బరువు తగ్గడం కోసం సర్జరీ చేయించుకొని ఆ సర్జరీ( Surgery ) కాస్త వికటించడంతో చనిపోయారు.
అలాకాకుండా ఆ హీరో ప్రపోజల్ కనుక ఈమె ఒప్పుకొని ఉంటే ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమె స్టార్ గా కొనసాగేదేమో అని కొందరు భావిస్తున్నారు అయినా వీధి రాసిన రాత నుంచి ఎవరు తప్పించుకోలేమని, అందుకు అందరూ అతీతులనే విధిరాతలో భాగంగానే ఈమె అర్థంతరంగా మరణించారని చెప్పాలి.
క్యాన్సర్ పై పోరాడుతున్న నాపై అలాంటి కామెంట్లు.. నటి సంచలన వ్యాఖ్యలు వైరల్!