డిగ్రీ కళాశాల తరగతులు ప్రారంభించండి – తహసిల్దార్ కార్యాలయం ద్వారా జిల్లా కలెక్టర్ కు వినతి

రాజన్న సిరిసిల్ల జిల్లా:ప్రభుత్వ డిగ్రీ కాలేజి మంజూరైనట్లు మంత్రి కేటీఆర్( Minister KTR ) ఆదేశాల మేరకు సిరిసిల్ల ప్రిన్సిపాల్ వడ్లూరి శ్రీనివాస్ నిన్నటి రోజు ప్రకటించగా విద్యార్థులకు తరగతులు ప్రారంభించాలని బుధవారం తహసిల్దార్ కార్యాలయం ద్వారా మండల కాంగ్రెస్ కమిటీ జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా తాసిల్దార్ కార్యాలయంలోని జూనియర్ అసిస్టెంట్ ప్రవీణ్ కుమార్ ( Praveen Kumar )కు వినతి పత్రం అందజేశారు.

మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ గతంలో కూడా ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు అయ్యిందని మంత్రి రెండుసార్లు ప్రకటించి తీరా బాలుర గురుకుల ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేసినట్లు తప్పుడు ప్రకటన చేయడం జరిగిందన్నారు.

ప్రజలకు వివిధ పార్టీల నాయకులకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ విద్యార్థులకు తరగతులు ప్రారంభిస్తేనే నమ్మకం ఏర్పడుతుందన్నారు.

ఎల్లారెడ్డిపేట( Yellareddypet ) ఉన్నత పాఠశాలలో సర్పంచ్ వెంకటరెడ్డి కళాశాల మంజూరి కోసం 30 పడకల ఆసుపత్రి కోసం అడిగితే కోపగించుకోవడం జరిగిందన్నారు.

ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ( Degree College )మంజూరు చేసినట్లు జీవో ఇవ్వడం జరిగిందని ఆరోపించారు.

అంతే కాకుండా ఈ నియోజకవర్గంలో మంత్రి డబ్బులు ఇవ్వ అని ఓటర్లకు మందుపొయ్యా అని పదే పదే ప్రకటించడం ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు.

ఇదే సంవత్సరంలో జరిగిన సెస్ ఎన్నికలలో బిజెపి పార్టీ డబ్బులు పంచితే బీఆర్ఎస్ పార్టీ అంతకంటే ఎక్కువ ఎన్నికల రోజు పంచి గెలుపొందిన విషయం మంత్రి మరిచిపోయినట్టు ఉన్నారని అన్నారు.

మంత్రి పూర్తిగా శ్రీరామచంద్రుని లాగా గాంధీ లాగా మాట్లాడతా ఉంటే ప్రజలు ఆశ్చర్యపోవడం జరుగుతుందన్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ తొమ్మిది సంవత్సరాలు చేసిన పోరాటాలకు ఫలితం దక్కిందని మంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు .

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, జిల్లా కార్యదర్శి లింగం గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి ,జిల్లా కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు మర్రి శ్రీనివాసరెడ్డి, నాయకులు గంట బుచ్చా గౌడ్,కొత్తపల్లి దేవయ్య ,రాజు నాయక్, చెన్ని బాబు, రామ్ రెడ్డి, తిరుపతి గౌడ్, తిరుపతిరెడ్డి,కిషన్, మల్లారెడ్డి, పరుశరాములు,చెట్టు పెళ్లి బాలయ్య, సత్తయ్య, చెరుకు ఎల్లయ్య, ప్రతాపరెడ్డి, సూడిద రాజేందర్, దండు శ్రీనివాస్,పందిర్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.

కొబ్బరి నీళ్లల్లో ఇవి కలిపి రాసారంటే మీ ముఖం మరింత ప్రకాశంవంతంగా మెరిసిపోవడం ఖాయం..!