సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాను ఎంత మంది వద్దనుకున్నారో తెలుసా ?
TeluguStop.com

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఈ మల్టీ స్టారర్ మూవీ ఓ రేంజిలో విజయాన్ని అందుకుంది.


శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనాలను విపరీతంగా ఆకట్టుకుంది.ఇందులో పెద్దోడుగా వెంకీ, చిన్నోడుగా మహేష్ మంచి నటన కనబర్చారు.


2013లో సంక్రాంతి కానుకనగా విడుదల అయిన ఈ చిత్రం భారీగా వసూళ్లను రాబట్టింది.
75 కోట్ల కలెక్షన్లు అందుకుంది.ఈ సినిమా పలు అవార్డులను అందుకుంది.
ఫ్యామిలీ జనాల మన్ననలు పొంది బెస్ట్ ఫ్యామిలీ మూవీగా అవార్డును దక్కించుకుంది.మిగతా కేటగిరీల్లో కూడా మరికొన్ని పురస్కారాలను పొందింది.
ఉత్తమ గీతా రచయితగా సిరివెన్నెల అవార్డు తీసుకున్నాడు.ఉత్తమ సహాయ నటుడిగా ప్రకాష్ రాజ్, ప్రత్యేక జ్యూరీ అవార్డును అంజలి దక్కించుకున్నారు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సీన్లు బాగా వైరల్ అవుతున్నాయి.ఈ సినిమాలో సమంతా.
గీత పాత్రలో నటించింది.అంత వరకు సమంతాకు సింగర్ చిన్మయి డబ్బింగ్ చెప్పేది.
అయితే ఈ సినిమాలో సమంతా సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది.జనాలకు ఈమె వాయిస్ తెగ నచ్చింది.
ఈమె క్యారెక్టర్ ను బాగా రిసీవ్ చేసుకున్నారు. """/"/
ఇందులో సీత పాత్ర కోసం ముందుగా చాలా మంది హీరోయిన్లను అనుకున్నారు.
త్రిష, భూమిక.స్నేహ, అనుష్క సహా పలువురు పేర్లను పరిశీలించారు.
అయితే చివరకు అంజలి ఈ పాత్రకు ఓకే అయ్యింది.అటు అంజలి కంటే ముందు ఈ పాత్ర చేయడానికి అమలా పాల్ ఓకే చెప్పిందట.
కారణాలు ఏంటో తెలియదు కానీ.చివరి నిమిషంలో తప్పుకుందట.
ఆ స్థానంలోకి అంజలి వచ్చి చేరింది.అటు హీరోల విషయంలోనూ ఇలాంటిదే జరిగిందట.
మహేష్ బాబు, పవన్ కల్యాణ్ ను ఈ చిత్రలో తీసుకోవాలని దర్శకుడు అనుకున్నాడట.
అయితే పవన్ ప్లేస్ లో వెంకీ ఓకే అయ్యాడట.రేలంగి మామయ్య క్యారెక్టర్ కోసం రాజశేఖర్ ను తీసుకోవాలి అనుకుంటే చివరకు ప్రకాష్ రాజ్ ఓకే అయ్యాడట.
మొత్తంగా ఈ సినిమా తెలుగు జనాలను బాగా ఆకట్టుకుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు.