గాయకుడిగా అందుకే నాకు అవకాశాలు తగ్గాయి.. మనో ఏం చెప్పారంటే..?

నటుడిగా, గాయకుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో మనో గుర్తింపును సొంతం చేసుకున్నారు.

తెలుగుతో పాటు కన్నడ, ఇతర భాషల సినిమాల్లో కూడా మనో సింగర్ గా మంచి పేరును సాధించారు.

బాల్యంలోనే సంగీతంలో శిక్షణ తీసుకున్న మనో నీడ అనే సినిమాలో బాలనటుడిగా నటించారు.

మనో అసలు పేరు నాగూర్ బాబు కాగా ప్రముఖ సంగీత దర్శకులలో ఒకరైన ఇళయరాజా పేరును మనోగా మార్చారు.

ఒకప్పుడు సింగర్ గా వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న మనోకు ఈ మధ్య కాలంలో సినిమా ఆఫర్లు తగ్గిన సంగతి తెలిసిందే.

మనో కీలక పాత్రలో నటించిన క్రేజీ అంకుల్స్ సినిమా ఈ నెల 19వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది.

ప్రముఖ దర్శకుడు ఈ.సత్తిబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహించగా శ్రీముఖి ఈ సినిమా టీవీ సింగర్ గా కనిపిస్తారని తెలుస్తోంది.

మనో మీడియాతో మాట్లాడుతూ ఈ సినిమాలో గోల్డ్ షాప్ ఓనర్ గా తాను కనిపిస్తానని చెప్పుకొచ్చారు.

"""/"/ సినిమాలో తన పాత్ర చాలా సరదాగా ఉంటుందని ఈ సినిమా యువతను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కిందని మనో అన్నారు.

తనకు నటుడిగా మరికొన్ని సినిమాల్లో ఆఫర్లు వస్తున్నాయని ఈ సినిమా రిజల్ట్ ను బట్టి తాను నిర్ణయం తీసుకుంటానని మనో కామెంట్లు చేశారు.

తన సినీ కెరీర్ లో ఇప్పటివరకు సినిమాల కోసం 25వేల పాటలు, ప్రైవేట్ ఆల్బమ్ ల కొరకు మరో 25వేల పాటలు పాడానని మనో తెలిపారు.

ట్రెండ్ మారడం వల్లే తనకు అవకాశాలు తగ్గాయని మనో కామెంట్లు చేశారు. """/"/ ప్రతి సింగర్ లో ఆర్టిస్ట్ ఉంటాడని పాట పాడే సమయంలో హీరోను ఊహించుకుని పాట పాడితే పాట పండుతుందని మనో చెప్పారు.

భవిష్యత్తులో కామెడీ ప్రధాన పాత్రలు ఎక్కువగా చేస్తానని మనో పేర్కొన్నారు.నటుడిగా విభిన్నమైన పాత్రలు పోషించాలని భావిస్తున్నానని మనో చెప్పుకొచ్చారు.

నేను ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రోజు రానే వచ్చింది అంటూ ఎన్టీఆర్ ట్వీట్..