బిగ్ బాస్ కంటెస్టెంట్‌పై అత్యాచారాయత్నం.. స్నేహితుడే ఆలా?

పాపులర్ సింగర్ అత్యాచారానికి గురైంది.అత్యాచారం చేసే వారిపై ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా ఇప్పటికీ సమాజంలో ఎటువంటి మార్పు లేదు.

సమాజం రోజు రోజుకి మరింత దిగజారుతుంది తప్ప ఎటువంటి మార్పు మాత్రం కనిపించడం లేదు.

ఇప్పటికే ఎంతోమంది స్త్రీలపై, చిన్నపిల్లలపై అత్యాచారాలు ఎదురవుతూనే ఉన్నాయి.కానీ బాధితులకు సరైన న్యాయం, దుండగులకు సరైన శిక్ష మాత్రం లేకుండా పోతుంది.

సామాన్యులకే కాదు ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు కూడా ఇటువంటివి చాలా ఎదుర్కొన్నారు.కొందరు తమ కెరీర్ కోసం బయటికి చెప్పుకోలేకపోతారు.

ఇదిలా ఉంటే తాజాగా మరో సెలబ్రెటీ బిగ్ బాస్ కంటెస్టెంట్ పై ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.

బిగ్ బాస్ కంటెస్టెంట్, ప్రముఖ గాయని.బాధితురాలి పేరును బయటకు పెట్టకపోగా పోలీసుల సమాచారం మేరకు అసలేం జరిగిందో బయటపడింది.

బాధితురాలు సమాచారం మేరకు తన స్నేహితుడు నుండి లైంగిక వేధింపులు తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దాంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.బాధితురాలిని నోయిడా సెక్టార్ 18 హోటల్ లోని ఎలివేటర్ లో తనను అసభ్యంగా ప్రవర్తించాడని పైగా దానికి దాడికి ప్రయత్నించాడని పోలీసులకు తెలిపింది.

"""/"/ పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం బిగ్ బాస్ లో పాల్గొన్న కంటెస్టెంట్, ప్రముఖ గాయని ప్రాజెక్టు షూటింగ్ కోసం నోయిడాకు వచ్చిందని తెలిపారు.

ఆమె ఓ హోటల్లో బస చేయగా రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో తన పనులు పూర్తి చేసుకొని హోటల్ గది కి వెళ్తున్న సమయంలో తన స్నేహితుడు ఆమె పై లైంగిక దాడికి ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు.

పైగా తనను ఎలివేటర్ ప్రాంతంలోనే బంధించేందుకు ప్రయత్నించాడట నిందితుడు. """/"/ తన చేతులను పట్టుకొని అత్యాచారానికి ప్రయత్నానికి పాల్పడ్డాడని తెలిపారు.

ఘటన జరిగిన సమయంలో పోలీసులకు, హోటల్ సిబ్బందికి ఫిర్యాదు చేయగా నిందితుడిని బెయిల్ పై విడుదల చేశారని తెలిపారు.

ఆమె రక్షణ కోసం తనకు ప్రొటెక్షన్ కల్పించామని తెలిపారు.ఇక బాధితురాలు కోరికమేరకు తన పేరును బయట పెట్టకుండా ఉన్నారు పోలీసులు.

వీడియో: ఫ్యాషన్ పిచ్చితో లిప్‌స్టిక్ టాటూ వేయించుకుంది.. ఇప్పుడామె పెదవులు చూడలేరు బాబోయ్!