సుమన్ అందుకే జైలుకు వెళ్లాడు..నిజం చెప్పిన నిర్మాత..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా అన్నిరకాల పాత్రల్లో నటించి సుమన్ గుర్తింపును సొంతం చేసుకున్నారు.

తెలుగుతో పాటు ఇతర భాషల్లో 150కు పైగా సినిమాల్లో నటించి నటుడిగా సుమన్ సత్తా చాటారు.

ప్రతిభ గల నటుడు అయిన సుమన్ కు ఇప్పటికీ వరుస ఆఫర్లు వస్తున్నాయి.

అయితే చాలా సంవత్సరాల క్రితం సుమన్ ఒక ​కేసులో చిక్కుకుని జైలు పాలైన సంగతి తెలిసిందే.

అయితే సుమన్ కేసులో అరెస్ట్ కావడానికి సంబంధించి ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.సుమన్ ఎందుకు అరెస్ట్ అయ్యాడో ఎవరూ కచ్చితంగా చెప్పలేకపోతున్నారు.

అయితే ప్రముఖ ప్రొడ్యూసర్లలో ఒకరైన సి కళ్యాణ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సుమన్ అరెస్ట్ కావడానికి అసలు కారణాలను వెల్లడించారు.

సుమన్ చాలా మంచి వ్యక్తి అని సి కళ్యాణ్ చెప్పుకొచ్చారు.కొందరు స్టార్ హీరోల వల్లే సుమన్ జైలుకు వెళ్లారని అప్పట్లో ప్రచారం జరిగిందని అయితే ఆ ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని సి కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

సుమన్ కు తన ఫ్రెండ్స్ తో చిన్న గొడవ జరిగిందని ఆ గొడవ వల్ల సుమన్ జైలుకు వెళ్లారని కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

అలా జరగడం సుమన్ తలరాత అనుకోవాలని కళ్యాణ్ వెల్లడించారు.సుమన లా సుమన్ మనస్సు కూడా అందంగా ఉంటుందని కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

సుమన్ తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీలో హీరోగా 12 సంవత్సరాలు బిజీగా ఉన్నారు.

దేవుని పాత్రలలో కూడా నటించి సుమన్ మెప్పించడం గమనార్హం.ప్రస్తుతం హీరోలకు, హీరోయిన్లకు తండ్రి పాత్రల్లో సుమన్ ఎక్కువగా నటిస్తున్నారు.

శంకర్ డైరెక్షన్ లో రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన శివాజీ సినిమా సుమన్ విలన్ రోల్స్ లో కూడా అద్భుతంగా నటించగలడని ప్రేక్షకులకు తెలిసేలా చేసింది.

ఈ మొబైల్ నంబర్ శాపగ్రస్తమైనదా.. ముగ్గురు ప్రాణాలను బలిదీసుకుందిగా..??