స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ లేటెస్ట్ రెమ్యునరేషన్ లెక్కలివే.. అంత తీసుకుంటున్నారా?
TeluguStop.com
టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్లలో అనిరుధ్ ( Anirudh )ఒకరనే సంగతి తెలిసిందే.
అనిరుధ్ తన సినీ కెరీర్ లో మ్యూజిక్ డైరెక్టర్( Music Director ) గా ఎన్నో విజయాలను అందుకున్నారు.
దేవర సినిమాకు అనిరుధ్ ఇచ్చిన మ్యూజిక్ , బీజీఎం ఆ సినిమాకు ఎంతో ప్లస్ అయ్యాయి.
నాని ది ప్యారడైజ్ సినిమాకు( The Paradise ) కూడా అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ సినిమాకు అనిరుధ్ రెమ్యునరేషన్ తెలిసి నెటిజన్లు ఒకింత షాకవుతున్నారు.ఈ సినిమా కోసం అనిరుధ్ ఏకంగా 15 కోట్ల రూపాయలు ఛార్జ్( 15 Crore Charge ) చేస్తున్నారని తెలుస్తోంది.
వాస్తవానికి తెలుగులో 15 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఒక సినిమాను నిర్మించవచ్చు.
అయితే అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తే పాన్ ఇండియా స్థాయిలో ది ప్యారడైజ్ సినిమాకు గుర్తింపు వస్తుంది కాబట్టి ఈ మ్యూజిక్ డైరెక్టర్ నే ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.
"""/" /
అనిరుధ్ ఈ సినిమాకు సాంగ్స్, బీజీఎం ఏ రేంజ్ లో ఇస్తారో చూడాలి.
ఈ మధ్య కాలంలో అనిరుధ్ సైతం నిరాశపరిచిన కొన్ని సినిమాలు ఉన్న నేపథ్యంలో ది ప్యారడైజ్ సినిమాతో ఏం జరుగుతుందో చూడాలి.
మరోవైపు ది ప్యారడైజ్ మూవీ గ్లింప్స్ పై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వచ్చాయి.
ఈ సినిమా గ్లింప్స్ లో బూతుల డోస్ ఎక్కువైందని నెటిజన్లు రియాక్ట్ కావడం జరిగింది.
"""/" /
నాని శ్రీకాంత్ ఓదెల కాంబో మూవీ ది ప్యారడైజ్ ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి నెలలో థియేటర్లలో రిలీజ్ కానుంది.
2026 సంవత్సరం శ్రీరామనవమి పండుగ కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.నాని తర్వాత సినిమాలతో మరిన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు.
తెలుగు రాష్ట్రాల్లో లీటరుకు రూ.3కు పైగా భారం