బాబోయ్‌ బిగ్ బాస్ మరో సీజన్‌ మా వల్ల కాదు..!

హిందీ బిగ్ బాస్‌ అన్ని సీజన్‌ లు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.

హిందీలో సూపర్‌ హిట్‌ అవుతుంది అనే ఉద్దేశ్యంతో తెలుగు మరియు తమిళంలో కూడా బిగ్ బాస్ ని ( Bigg Boss ) మొదలు పెట్టిన విషయం తెల్సిందే.

తెలుగు లో మొదటి సీజన్ కి ఎన్టీఆర్‌( NTR ) హోస్టింగ్ చేయడం తో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఆ తర్వాత నుంచి అసలు కథ మొదలు అయింది.బిగ్ బాస్ కి రేటింగ్ తగ్గి పోయింది.

కంటెస్టెంట్స్ అస్సలు బాగుండటం లేదు అంటూ ప్రేక్షకులు విమర్శలు చేయడం మొదలు పెట్టారు.

అయినా కూడా కంటెస్టెంట్స్ కి తక్కువ డబ్బులు ఇస్తూ సోషల్ మీడియా వారిని తీసుకు రావడం జరిగింది.

ఇక నాగార్జున( Nagarjuna ) హోస్ట్‌ గా చేస్తున్న నేపథ్యం లో కూడా ప్రేక్షకులు పెద్దగా థ్రిల్‌ అవ్వడం లేదు.

కొత్త హోస్ట్‌ కావాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.కానీ నిర్వాహకులు మాత్రం ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు.

ఒక వేళ బిగ్‌ బాస్ కి కొత్త బాస్ ను తీసుకు రావాలని భావించినా కూడా వారికి సాధ్యం అవ్వడం లేదు.

"""/" / ప్రస్తుతం తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్ 7( Bigg Boss Telugu 7 ) నడుస్తోంది.

ఈ సీజన్ ఏమాత్రం ఆకట్టుకోవడం లేదు.ఉల్టా పుల్టా అంటూ పెద్దగా ప్రచారం చేశారు.

అయినా కూడా జనాలు ఈ సీజన్ ని కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు.

దాంతో రేటింగ్( Bigg Boss Rating ) పెద్దగా రావడం లేదు అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.

సీరియల్స్ ప్రసారం చేసుకున్నా కూడా స్టార్‌ మా కి మంచి రేటింగ్‌ వస్తుంది.

"""/" / కానీ బిగ్‌ బాస్ కి మాత్రం రేటింగ్ రావడం లేదు.

అందుకే వచ్చే సీజన్‌ ను మా ఛానల్ లో టెలికాస్ట్‌ చేయడం సాధ్యం కాదు అంటూ బిగ్‌ బాస్ నిర్వాహకులకు చెబుతున్నారట.

అంతే కాకుండా బిగ్‌ బాస్‌ కి నాగ్‌ గుడ్‌ బై చెప్పే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి.

ఇన్ని కారణాల కారనంగా బిగ్‌ బాస్ 8( Bigg Boss 8 ) ఉంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

పోలవరం కోసం విదేశీ నిపుణులు రప్పిస్తున్నాం సీఎం చంద్రబాబు కీలక ప్రకటన..!!