చిన్న హీరోల కథలను దొబ్బేసి విజయాలు సాదించిన పెద్ద హీరోలు ఎవరు ?

ఏదైనా ఒక కథ బాగుంది అనే టాక్ మామూలుగా సినిమా షూటింగ్ మొదలయ్యేంత వరకు ఇప్పటి రోజుల్లో అయితే బయట పెట్టడం లేదు.

కానీ కొంతకాలం వెనక్కి వెళితే ఒక హీరో కథని మరొక హీరో కేవలం అది హీట్ అవుతుంది అనే కారణంతో తీసేసుకున్న సందర్భాలు ఉన్నాయి.

కేవలం సినిమా కథ ముందే ఒక ప్రొడక్షన్ నుంచి మరొక హీరో దగ్గరికి వెళ్లడం అంటే అది నిజంగా రాజకీయాలు జరిగినట్టే అనుకోవాలి.

అలా స్టార్ హీరోలు చిన్న హీరోల దగ్గర నుంచి మంచి కథలను లాక్కున్న సందర్భాలు ఉన్నాయి.

తమ కోసం లేదా తమ పిల్లల కోసం ఇలా వారు చేస్తూ ఉంటారు.

ఇంతకీ ఎవరి కథలను ఎవరు దొబ్బేసారు అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

"""/" / ఠాగూర్ సినిమా( Tagore Movie ) మీ అందరికీ గుర్తుండే ఉంటుంది.

ఈ సినిమాలో చిరంజీవి( Chiranjeevi ) హీరోగా నటించిన అది అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

అయితే ఈ సినిమా చేయాల్సిన హీరో మాత్రం చిరంజీవి కాదు.దానికి రాజశేఖర్( Rajasekhar ) హీరోగా నటించాల్సి ఉండగా కథ బాగుంది అని అలాగే అప్పటి రాజకీయ పరిస్థితులకు చిరంజీవికి ఉపయోగపడుతుంది అని ఒకే ఒక కారణంతో అల్లు అరవింద్ చక్రం తిప్పి ఆ సినిమాలో చిరంజీవికి వచ్చేలా చేసాడు.

చిరంజీవి స్టామినాకు తగ్గట్టుగా సినిమాలో కొన్ని మార్పులు చేర్పులు చేసినప్పటికీ ఠాగూర్ కథ కి మాత్రం మొదటి హీరో రాజశేఖర్.

"""/" / ఇక ఢీ సినిమా( Dhee Movie ) మంచు విష్ణు( Manchu Vishnu ) హీరోగా రాగా, ఇది కూడా అతని కెరియర్ లోనే ది బెస్ట్ చిత్రంగా చెప్పుకోవచ్చు.

అయితే ఈ సినిమా మొదట రవితేజ( Ravi Teja ) కోసం తయారు చేయబడింది.

అలాగే రవితేజ కి స్టోరీ నచ్చింది.ప్రి ప్రొడక్షన్ మొత్తం పూర్తి చేసుకొని కేవలం షూటింగ్ కి వెళ్లాల్సిన కొద్ది రోజుల ముందు మంచు మోహన్ బాబు రవితేజను పిలిపించి ఆ కథను తనకు ఇవ్వాల్సిందిగా అడగడంతో ఆయన కూడా ఓకే అన్నారు.

ఇక అమ్మానాన్న ఓ తమిళమ్మాయి సినిమా కథ కూడా బాగుంది అనే విషయం తెలిసిన మంచు విష్ణు మరోసారి అదే ప్రయత్నం చేయగా పూరి జగన్నాథ్ మాత్రం రవికి ఇచ్చిన మాట కోసం ఆ చిత్ర కథను ఎవరికి ఇచ్చే ప్రసక్తే లేదు అని తేజు చెప్పడంతో ఆ సినిమాని వదిలేశారు.

జులై 4వ తారీఖు ఢిల్లీ వెళ్ళబోతున్న సీఎం చంద్రబాబు..!!