స్టార్ హీరోల తమ్ముళ్లయితే చాలా? యాక్టింగ్ రావక్కర్లేదా?

సినిమా ఇండస్ట్రీలో భారీ బ్యాగ్రౌండ్ వుంటే చాలు ఏకంగా ఆ కుటుంబానికి చెందిన వారసులే కాదు వారి బంధువుల కుటుంబాలకు చెందిన వారు సైతం హీరో గా ఎంట్రీ ఇస్తున్న ఘటనలు నేటి రోజుల్లో కనిపిస్తున్నాయి.

ముఖ్యంగా ఇటీవలి కాలంలో అయితే ఒకరు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న హీరో గా కొనసాగితే.

ఇక వాళ్ళ తమ్ముళ్ళు కూడా అదే క్రేజ్ తో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు.

అంతేకాదు కొంతమంది నటన రాకున్నా ఎంట్రీ ఇస్తూ చివరికి బొక్క బోర్లా పడి పోతున్నారు.

ఇలా అన్నల బ్యాగ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చిన తమ్ముళ్లు ఎవరు ఇప్పుడు తెలుసుకుందాం.

H3 Class=subheader-styleఆనంద్ దేవరకొండ :/h3p ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా చాలానే కష్టాలు పడి ఇప్పుడు స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు విజయ్ దేవరకొండ.

విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఆనంద్ దేవరకొండ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చాడు.అయితే దొరసాని సినిమాలో నటించాడు.

ఈ సినిమా మంచి టాక్ కూడా సొంతం చేసుకుంది.కానీ ఎందుకొ ఆనంద్ దేవరకొండ నటనకు మాత్రం మంచి మార్కులు పడలేదు.

ఇక ఆ తర్వాత మొన్నటికి మొన్న బొంబాయి చట్నీ, పుష్పక విమానం సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఆనంద్ దేవరకొండ.

నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. """/" / H3 Class=subheader-styleబెల్లంకొండ గణేష్ :/h3p ఇప్పటికే నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు గా సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్.

ఇంకా సరైన స్టార్ డమ్ కోసం పాకులాడుతూ నే ఉన్నాడు.ఇలాంటి సమయంలోనే ఇక సాయి తమ్ముడు బెల్లంకొండ గణేష్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు.

"""/" / H3 Class=subheader-styleఅభిరామ్ :/h3p స్టార్ నిర్మాత సురేష్ బాబు తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మంచి హీరో గా కొనసాగుతున్నాడు రానా.

అయితే రానా తమ్ముడు అభిరామ్ కూడా ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.

అభిరామ్ గురించి ఇప్పటికే ఇండస్ట్రీలో కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి.ఇప్పుడు అభి రామ్ హీరోగా ఎలా రాణిస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది.

"""/" / H3 Class=subheader-styleవైష్ణవ్ తేజ్ :/h3p మెగా మేనల్లుడి ట్యాగ్ తో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు సాయి ధరమ్ తేజ్.

ఇక ఇప్పుడు సాయి ధరంతేజ్ ట్యాగ్ తో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు వైష్ణవ్ తేజ్.

ఉప్పెన అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు.

శ్రీకాంత్ అయ్యంగార్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి పట్టిన ఓ దరిద్రం.. తరిమేయాల్సిందే..?