Celebrity Kids: తమ పిల్లల్ని కెమెరాకు చూపించడానికి ఇష్టపడని సెలబ్రిటీలు వీరే !

సెలబ్రిటీలు ఏం చేసినా సోషల్ మీడియాకు, మీడియాకు పండగే.అందుకే వారు కనిపించగానే హడావిడి చేస్తూ సెల్ఫీలు దిగుతూ వారితో కెమెరాలకు ఫోజులిస్తూ ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.

పైగా వారు ఎలాంటి డ్రెస్ వేసుకుంటారు, ఏం తింటారు, ఎలా ఉంటారు అనే విషయాలను తెలుసుకోవడానికి కూడా అందరికీ చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది.

వారు ఏం చేసినా అది మీడియాలో వైరల్ అవుతుంది కాబట్టి తమలాగా తమ పిల్లలు ఎప్పుడూ కంటెంట్ గా మారకూడదు అని కొంతమంది వారి మొహాలను కూడా కెమెరాలకు చూపించడానికి ఇష్టపడటం లేదు.

అలా తమ పిల్లలను కెమెరాకు చూపించడానికి ఇష్టపడని ఆ సెలబ్రెటీలు ఎవరో ఇప్పుడు చూద్దాం.

H3 Class=subheader-styleనయనతార/h3p """/" / పెళ్లయిన రెండు నెలలకే కవల పిల్లలకు జన్మనివ్వబోతున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించింది నయనతార( Nayantara ) ఇక తమ పిల్లలు పుట్టిన మరుక్షణం నుంచి పలుమార్లు విమానాల్లో తిరుగుతూ ఎయిర్పోర్ట్స్ లో కనిపించినప్పటికీ వారి మోహాలను దాచేస్తూ వారు ఎలా ఉంటారో ఇప్పటివరకు కెమెరా కళ్ళకు చిక్కనివ్వకుండా కాపాడుతూ వస్తోంది.

H3 Class=subheader-styleవిరాట్ కోహ్లీ - అనుష్క శర్మ/h3p """/" / అనుష్క శర్మ( Anushka Sharma ) సైతం ఇప్పటివరకు తన కుమార్తె ఫోటోలను మీడియాకు ఇవ్వడానికి ఒప్పుకోదు వారి ఫోటోలను ఎవరైనా తీసినా కూడా ఆమె డిలీట్ చేసేంతవరకు కూడా పట్టుబడుతుంది అలా అనుష్క శర్మ తన కూతురికి మీడియాలో ఎలాంటి పిక్చర్స్ కానీ వీడియోస్ కానీ ఉండకూడదు అని అనుకుంటుంది.

H3 Class=subheader-styleఆలియా భట్- రన్బీర్ కపూర్/h3p """/" / పెళ్లికి ముందే గర్భవతిగా మారిన ఆలియా ( Alia Bhatt ) పెళ్ళైన ఐదు నెలలకే పండంటి కూతురికి జన్మనిచ్చింది.

అయితే ఇప్పటివరకు ఆలియా కుమార్తె ఎలా ఉంటుందో మీడియాకు తెలియదు ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉంది ఈ బాలీవుడ్ జంట వారి కుమార్తెను మీడియా ముందు తీసుకుని రాకూడదు అని ఫిక్స్ అయిపోయారు.

అందుకే ఇప్పటి వరకు అలియా భట్ కుమార్తె ఫోటోలు ఎక్కడ కూడా లేదు.

ఇక నిన్న మొన్నటి వరకు కూడా ప్రియాంక చోప్రా ఇలాగే ప్రవర్తించింది కానీ ఒక పబ్లిక్ ఈవెంట్లో ప్రియాంక నిక్ జోనస్ దంపతులు తమ కుమార్తెను అందరికీ పరిచయం చేశారు అలా కానీ వీరందరికీ విరుద్ధంగా కాజల అవ్వాలి తన కొడుకు పుట్టిన వెంటనే ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

వీలైనంత వరకు మీడియా ముందే ఉంచడానికి ప్రయత్నిస్తుంది కాజల్ అగర్వాల్.

వైరల్: జలుబు చేసిందని ఇంగ్లీషులో యజమానికి చెబుతున్న చిలుక!