ఎన్టీఆర్ కోసం రొయ్యలు, పీతలు వండిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా ?

సినీ ప్రపంచంలో నందమూరి తారక రామారావు సృష్టించిన ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఆయన చేసిన సినిమాలన్నీ కూడా ఇప్పటికి రికార్డులు బద్దలు కొడుతూనే ఉన్నాయి.ఎన్టీఆర్ పోషించిన అనేక పౌరాణిక పాత్రల కోసం ప్రజలు ఎగబడి చూసేవారు.

ఆయన్ని కృష్ణుడిగా, రాముడిగా కొలుచుకునేవారు.కేవలం తెలుగు ప్రేక్షకులే కాదు తమిళ, కన్నడ, హిందీ ప్రజలు సైతం ఎన్టీఆర్ కి కనెక్ట్ అయ్యారంటే అది మామూలు విషయం కాదు.

ఆయన చనిపోయి చాలా ఏళ్లు గడుస్తున్నప్పటికీ కూడా అన్నగారంటే తెలుగు మనసుల్లో చెరగని స్థానం ఎప్పటికీ నిలిచి ఉంటుంది.

ఇక ఎన్టీఆర్ సినిమా వస్తుందంటే చాలు అప్పట్లో అంతా పండగ వాతావరణం ఉండేది ఇది నాణానికి ఒకవైపు మాత్రమే.

నాణానికి ఒక మరొక పార్శం కూడా ఉంది.అన్న గారి సినిమా షూటింగ్ పూర్తి అయ్యే సమయానికి సినిమా యూనిట్ అంతా కూడా పండగ చేసుకునే వారట.

సినిమా చివరి షూటింగ్ రోజు ఎన్టీఆర్ తో పాటు హీరోయిన్స్ ఇతర నటి నటులు అంతా కూడా ప్రత్యేకంగా వచ్చేవారట అన్నగారి దగ్గరికి.

అప్పట్లో నిర్మాణ సంస్థలన్నీ కూడా సినిమాకు సంబంధించిన అలాగే స్టార్స్ కు సంబంధించిన పనులు చేసుకుంటూ ఉండేవారు.

ఇక హీరో హీరోయిన్స్ కు సంబంధించిన అన్ని పనులు కూడా నిర్మాణ సంస్థలే చూసుకునేది.

సినిమా పూర్తయింది అంటే చాలు ఆ సినిమా యూనిట్ అందరిని కూడా పిలిచి భోజనాలు పెట్టడం, విందులు జరిపించడం లాంటివి అప్పట్లో బాగా జరిగేవి.

వాహిని, జెమిని స్టూడియోల నిర్మాతలు అలాంటి ఆనవాయితీని కొనసాగించారు.తమిళ సినిమా రంగంలో అయితే ఇప్పటికీ కూడా ఈ సాంప్రదాయం కొనసాగుతోంది.

ఏ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న కూడా ఆ షూటింగ్ చివరి రోజు యూనిట్ అందరికీ కూడా విందు భోజనాలు ఏర్పాటు చేస్తారు.

ఇక అప్పట్లో ఎన్టీఆర్, సావిత్రి కలిసి ఎక్కువగా సినిమాలో నటించేవారు.సావిత్రి భోజనం ప్రియురాలు అలాగే ఎన్టీఆర్ కూడా మంచి భోజనం ప్రియుడన్న విషయం మనందరికీ తెలిసిందే.

ఇక సావిత్రి అయితే మాంసాహారం బాగా ఇష్టంగా తినేవారు అందుకే తనతోపాటు ఎన్టీఆర్ కి కూడా మాంసాహారం అంటే ఇష్టం కాబట్టి చివరి షూటింగ్ రోజు ఏర్పాటు చేసే విందులో సావిత్రి ప్రత్యేకంగా ఎన్టీఆర్ కోసం వంటకాలు తయారు చేయించి తీసుకొచ్చేవారట.

నటీనటులందరికీ సరిపడ పీతలు, చేపలు, రొయ్యల పులుసులతో పాటు నాటుకోడి వంటి నాలుగైదు రకాల నాన్ వెజ్ వంటకాలను సిద్ధం చేసేవారు సావిత్రి.

"""/" / ఎన్టీ రామారావు తో పాటుగా ఆ సినిమా యూనిట్ అంతా కూడా సావిత్రి చేసుకొచ్చే స్పెషల్ వంటకాల కోసం ఎదురు చూసేవారట.

అంతే కాదు లొట్టలేసుకొని మరీ తినేవారట.ఆ తర్వాత ఆ సాంప్రదాయాన్ని నటి శారద సైతం కొన్నాళ్లపాటు పాటించారు.

ఆ తర్వాత అదే సాంప్రదాయాన్ని వాణిశ్రీ సైతం కొనసాగించారు.ఇక ఈ మధ్యకాలంలో చెప్పుకోవాలంటే నటి నిర్మలమ్మ తను చనిపోయేంత వరకు కూడా ఇదే పద్ధతిని పాటించారు.

ఈ ఇద్దరు స్టార్ హీరోల మొదటి హీరోయిన్లు సక్సెస్ కాలేదనే విషయం మీకు తెలుసా..?